ఆన్లైన్ క్లాసులు పిల్లలకు ఇంత ప్రమాదమా..?

MOHAN BABU
కరోణ వైరస్ మొదలైనప్పటి నుంచి పాఠశాలలు, కళాశాలలు అన్నీ పూర్తిగా మూతపడ్డాయి. దీంతో  వారంతా క్లాసులను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. అలా చాలా మంది పిల్లలకు ఆన్ లైన్ క్లాసులతో ఎక్కువ బిజీగా ఉంటున్నారు. ఈ కరోనా పుణ్యమా అని చాలా మంది పిల్లలకి చేతుల్లోకి మొబైలు, ల్యాప్టాప్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఆన్ లైన్ క్లాసులు వినడం కంటే  ఎక్కువగా ఇతరాత్రా పనులు ఎక్కువగా చేస్తున్నారు. దీంతో  ఉదయం మొదలు పడుకునే వరకు ఈ ఎలక్ట్రానిక్ వస్తువులతోనే పిల్లలు గడుపుతున్నారు. దీనివల్ల  మొబైల్, కంప్యూటర్ ఎక్కువగా చూడడం ద్వారా కరోణ వైరస్ కంటే ఎక్కువ ప్రభావం ఆరోగ్యంపై చూపిస్తోంది.
డాక్టర్లు  ఆన్ లైన్ ఎడ్యుకేషన్ వల్ల  జరిగే సమస్యల గురించి కూడా  చెప్పడం జరిగింది. పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల  ఎక్కువ సేపు ఆన్లైన్ క్లాసులోనే ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలలో ఎక్కువగా కంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల  కొద్దిరోజుల తర్వాత పిల్లలకి  మయోపియా సమస్య వచ్చే అవకాశం ఉందని  నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్య పిల్లల కంటి చూపుపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఎక్కువ ఆన్లైన్ క్లాసులు వినడం వల్ల  ఈ సమస్య వస్తుందని  వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువగా ఆన్లైన్లో చూసేటప్పుడు  బ్రైట్ నెస్ తగ్గించుకోవాలని, వారంటున్నారు. వీటిల్లో  మొబైల్ ఫోన్ల ద్వారా ఇంకా ఎక్కువగా కంటిపై ప్రభావం పడుతుందని, కాబట్టి వీలైనంతవరకూ  మొబైల్ ఫోన్ల కంటే ల్యాప్ టాప్, కంప్యూటర్లు ఉపయోగించడమే మంచిదని  డాక్టర్లు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ద్వారానే  మయోపియా సమస్యలు ఎక్కువ వస్తాయని ఎందుకంటే స్మార్ట్ఫోన్ స్క్రీన్ చిన్నగా ఉండటం వల్ల  మనం  కంటిచూపును గట్టిగా కళ్ళు తెరిచి చూస్తామని దాంతో ఎక్కువ ప్రభావం చూపుతోందని  తెలిపారు. వీలైనంతవరకూ  ఆన్లైన్ క్లాసులు వినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: