బుడుగు: పిల్లలను కోవిడ్ నుండి ఇలా రక్షించుకోండి..!!

N.ANJI
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ విజృంభణ దారుణంగా ఉంది. ఇక ఈ విపత్కార సమయంలో పిల్లలను కరోనా నుంచి రక్షించుకోవడం కోసం ఆయుష్‌ మినిస్ట్రీ కొన్ని మార్గదర్శకాలను సూచిస్తున్నారు.
ఇక పిల్లలకు మాస్క్‌ వాడకం, యోగా సాధన, ఆయుర్వేద ఔషధాలు, న్యూట్రాస్యూటికల్స్‌తో వ్యాధుల నియంత్రణ, టెలికన్సల్టేషన్‌ సౌలభ్యం ఉపయోగించుకోవడంతో పాటు పిల్లలకు కొవిడ్‌ చికిత్సలో అనుసరించవలసిన మరో ఐదు మార్గదర్శకాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ మార్గదర్శక సూత్రాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.
సాధారణంగా 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ ఇంజెక్షన్‌ బధ్రత, పనితీరులను నిర్ధారించే డాటా లేదని తెలిపారు. ఇక పిల్లలకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ను కొవిడ్‌ చికిత్సలో ఇవ్వకూడదని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అలాగే ఆరు నిమిషాల నడకను 12 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు మాత్రమే తల్లితండ్రుల పర్యవేక్షణలో ఈ పరీక్ష కొనసాగించాలని తెలిపారు.
నేటి సమాజంలో చాలా మంది పిల్లలు ఉబ్బసం సమస్యతో బాధపడుతుంటారు. ఇక ఇన్‌ హోం మానిటరింగ్‌ ని అదుపు తప్పిన ఉబ్బసం కలిగిన పిల్లలకు మినహా, మిగతా పిల్లలకు ఈ పరీక్షను ప్రతి 6 నుంచి 8 గంటలకోసారి చేయవచ్చునని అన్నారు. అంతేకాదు.. స్టిరాయిడ్లు అలంటి వాటిని పిల్లలకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన సమయం పాటు మాత్రమే వాడాలని సూచించారు. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్క్‌ అవసరం లేదని అన్నారు. ఇక 6 - 11 ఏళ్ల పిల్లలు మాస్క్‌ పెట్టుకోగలిగితే తల్లితండ్రులు వాటిని, పిల్లలు ధరించేలా చూడాలని తెలిపారు. అంతేకాక.. 11 ఏళ్ల కంటే పెద్ద పిల్లలు తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: