బుడుగు: పిల్లల ఎదుగుదల ఎలా తెలుసుకోవాలి...?

N.ANJI
తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో మార్పులను చూసి చాలా బెంగపెట్టుకుంటుంటారు. వారి హైట్‌లో మార్పులు రావడంలేదని తెగబాధపడుతుంటారు. పిల్లలలో ఎదుగుదల లేకపోడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చును వాటిని తల్లి దండ్రుల అధికమించి పిల్లల బరువు, ఎత్తు సరిపపడేలా ఉండేలా చూసుకోవాలి. ఇక సరైన బరువు, ఎత్తు ఆరోగ్యానికి చిహ్నం.
ఇక పిల్లలు పెద్దవారవుతున్న కొద్దీ చాల సందర్భాల్లో ప్రస్తావనకు వస్తుంది. మరి తయారుగా ఉండేదుకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏ అంశాలు ఏ ఆహార పదార్థంలో ఉంటాయి. అవి బిడ్డల ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయి అని ధ్యాస వహించాల్సి ఉంది. ఇక్కడ మేము చెప్పే క్యాలిక్యులేషన్‌లతో మీరు మీ పిల్లల్లో ఎదుగుదలను మీరు గమనించగలరు. అయితే పిల్లల ఎదుగుదలను ఎలా తీసుకోవాలో చుద్దామా.
అయితే తల్లిదండ్రుల హైట్ ఎలా వుంటే పిల్లల్లో కూడా హైట్ అలాగే ఉంటుందని, దీనిని ఎవరు కూడా నియంత్రించలేరని వైద్యులు తెలిపారు. పిల్లల హైట్ దాదాపు 90 శాతం తల్లిదండ్రుల హైట్‌తో సంబంధం ఉంటుంది. తల్లిదండ్రులిరువురు మంచి హైట్ ఉంటే పిల్లల్లోకూడా ఎదుగుదల బాగుంటుంది. పిల్లలు పుట్టినప్పుడు సహజంగా వారి పొడవు 50 సెంటీ మీటర్లు ఉంటుంది. ఒక ఏడాది తర్వాత 75 సెంటీ మీటర్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు. ఇలా పిల్లలు కిశోరావస్థకు చేరుకునేవరకు పెరుగుదల జరుగుతుంటుంది.
అలాగే.. కిశోరావస్థలో పెరుగుదల చాలా వేగంగా పెరుగుతుంది. అమ్మాయిలలోనైతే 10 సంవత్సరాలు, అబ్బాయిలలోనైతే 12సంవత్సరాల తర్వాత పెరుగుదల ప్రారంభమౌతుంది. పుష్టికరమైన ఆహారంతోబాటు మంచిగా వ్యాయామం చేస్తే మీ పిల్లల్లో పెరుగుదల కనపడుతుందని వైద్యులు తెలిపారు. టానిక్కులు, ప్రోటీన్ పౌడర్, ఇతర మందులపై ఆశపెట్టుకోకూడదంటున్నారు వైద్యులు. ఇవి బలహీనంగానున్న పిల్లలకు మాత్రమే పనికొస్తాయి. మరీ మీ పిల్లల ఎదుగుదల గురించి బెంగ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: