బుడుగు: మీ పిల్లలు ఫోన్ లో ఏమి చూస్తున్నారో గమనిస్తున్నారా..!
డబ్బు అవసరం కోసం వాళ్లు కూడా ఈ నేరంలో భాగమౌతున్నారు. శృంగార సంబంధం అయినా చాట్ లో పాల్గొనాలని ఎవరైనా అనుకుంటే.. వారికి అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీ తో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఆ ఐడి లోకి వెళ్లి వీడియో కాల్ చేస్తే… అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తారు. ఇందు కోసం రూ.550 చెల్లిస్తే సరిపోతుందని తెలియచేస్తున్నారు.
ఇక డబ్బులు చెల్లించిన వారికి అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీలు ఇస్తున్నారు…. గతంలోనూ ఈ రకం సెక్స్ వ్యాపారాలు జరిగినప్పటికీ ఈ కరోనా కాలంలో మరింత పెరిగిపోయాయి. అయితే దీనిలో మైనర్ బాలురు కూడా పాల్గొనడం ఆందోళన కలిగించే విషయంగా ఉంది. చిన్నారులకు ఇలాంటి వీడియోలు చూడటం అలవాటు అయితే మాత్రం పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే వీటి వలన పిల్లల్లో మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలపై పోలీసులు పెద్దగా శ్రద్ధ చూపించడం లేదనే వాదనలు కూడా లేకపోలేదు. ఇలాంటి వాటిని కూడా వ్యభిచార దందా గా భావించి చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకుంటున్నారు. ఈ తరహా వ్యవహారం కేరళ రాష్ట్రంలో మరింతగా పెరిగిపోయానని స్థానికులు తెలియచేస్తున్నారు.