బుడుగు: పిల్లలు చెక్కర తింటున్నారా.. అయితే జాగ్రత్త సుమీ..!
ఇక చిన్న వయసులోనే చెక్కెర తినడం వలన పారాబాక్టీరాయిడ్స్ స్థాయిలు పెరుగుతాయన్నారు. అలాగే పారాబాక్టీరాయిడ్స్ స్థాయిలు ఎక్కువగా కావడం వలన అవి మెదడుపై ప్రభావం చూపిస్తుందని యూజీఏ కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కన్స్యూమర్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమిలీ నోబెల్ చెప్పారు. అంతేకాక చక్కెర ఎక్కువగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందన్నారు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలను కూడా సృష్టిస్తుందని తేలింది. రోజుకు కనీసం 10 శాతం కంటే తక్కువ కేలరీల షూగర్ మాత్రమే తీసుకోవాలని యూఎస్ వ్యవసాయ శాఖ, ఆరోగ్య మానవ సేవల శాఖ సూచిస్తుంది.
తాజాగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్లో వెలువడిన సమాచారం ప్రకారం 9 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు చెక్కర ఎక్కువగా ఉండే డ్రింక్స్‌లో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. హిప్పోకాంపస్ పలు రకాల అభిజ్ఞాత్మక పనితీరుపై పనిచేసే టీనేజ్ పై అభివృద్ధి చూపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. హిప్పోకాంపల్.. ఫ్రీ మోమరీ ఫంక్షన్ అనేది జంతువుల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపించదు.
అయితే చిన్న వయసులోనే చెక్కర వినియోగం వలన వారి హిప్పోకాంపల్, జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుందని నోబెల్ తెలిపారు. అధిక చెక్కర వినియోగం వలన గట్ మైక్రోబయోమ్లోని పారాబాక్టీరాయిడ్ల స్థాయికి దారి తీసిందన్నారు. అంతేకాక జీర్ణశయాంతర ప్రేగులలోని 100 ట్రిలియన్లకు పైగా సూక్ష్మ జీవులు మానవ ఆరోగ్యం, వ్యాధుల పై ప్రభావం చూపిస్తాయి.