బుడుగు: మీ పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదా.. ఈ సమస్యలు తప్పవు..!?

N.ANJI
చిన్నపిల్లలు సరిగ్గా నిద్రపోయినప్పుడే వారి ఎదుగుదల మంచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ వయస్సు పిల్లలు ఎన్ని గంటలు నిద్ర పోవాలో ఒక్కసారి తెలుసుకుందామా. ఇక 4-5 ఏళ్ళ వయసు లోపు పిల్లలకు 11 గంటల 30 నిమిషాల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది. 5-8 ఏళ్ళ వయసు పిల్లలు 11 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది. 8-10 ఏళ్ళ వయసు పిల్లలు 10 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది. పిల్లలు సరిపడా నిద్ర పోక పోతే  పిల్లల మనసు నిలకడగా లేక పోవటం వల్ల దేనిమీద ధ్యాస పెట్టలేరు. నిద్ర తక్కువయిన పిల్లల్లో పెద్దవారిలో ఉన్నట్టే బద్దకం గా  ఉంటుంది. జ్ఞాపకం తగ్గటం, నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఇవ్వన్నీ కూడ నిద్ర సరిగా లేనందు వల్ల పిల్లలందరిలో కనిపించే లక్షణాలు ఏంటో చూద్దామా.
ప్రతి రోజు సాయంత్రం తప్పకుండా స్నానం చేయించడం, వదులుగా ఉండే బట్టలు వేయడం, రాత్రి భోజనంలో వారు సరిపడినంత  ఆహారం  తీసుకునేల చేయడం, బోజనం అయ్యాక వారితో ప్రేమగా కబుర్లు చెప్పడం, నిద్ర పోవటానికి ముందు పళ్లు తోము కోవటం, లాంటివి ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో చేయించాలి.
ఇక కొన్ని పద్ధతులను పాటించటం వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. వయస్సుకు తగ్గట్టుగా  పిల్లల్ని నిద్ర పోయేటట్టు అలవాటు చేయాలి. సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఒకే సమయానికి  పడుకోవటం, లేవడం అలవాటు చేయాలి. సెలవుల్లో  పిల్లలు నిద్ర వేళలు మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా, స్కూల్స్  తెరవటానికి కనీసం పది రోజులు ముందు నుండి నిద్ర వేళల్ని సరిచేయాలి.
అంతేకాక పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేములు లాంటివి లేకుండా చూసుకోవాలి. అలాగే నిద్ర కు అర గంట ముందు వాటిని చూడడం హోం వర్కు చేయటం,చదవటం వంటివి చేయించకూడదు. సాయంత్రాలల, రాత్రిపూట పిల్లలు తినే ఆహారం లో జాగ్రత్తలు  తీసుకోవాలి. సాయంత్రం తరువాత చోక్లెట్స్ కూల్ డ్రింక్స్ తీసుకోకుండా చూడాలి. వీటిలో ఉండే కెఫీన్  నిద్రను పాడు చేస్తుంది. పడుకునే మందు రిలాక్స్ కావటాన్ని పిల్లలకు  నేర్పించాలి. ‘బెడ్ రొటీన్స్’ అలవాటు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: