బుడుగు: పిల్లల చదువు విషయంలో బాధపడుతున్నారా..!?

N.ANJI
నేటి సమాజంలో పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడి చదువును నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఒక్కొక్కరి పద్దతి ఒక్కోలా ఉంటుంది. ఇక పిల్లలను ఎప్పుడు పక్కవారితో పోల్చకూడదు. పిల్లల తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను మార్కులలో కొలవడం  కూడా సరియైన పని కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక పిల్లలకు సంబందించిన కొన్ని అంశాల మీద అవగాహన పెంచుకోవడం వలన తల్లిదండ్రులు పిల్లల మానసిక ఉన్నతికి సహకరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. చదివిన చదువులు, మాత్రమే పిల్లల తెలివితేటలకు కొలమానం కాదని   తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇక ఆటపాటలు, జీవిత నైపుణ్యాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలు వంటివి ర్యాంకుల కంటే కూడా గొప్పవి అని గుర్తు పెట్టుకోవాలి. మన విద్యావ్యవస్థ లో ఇలాంటి విషయాల గురించి ఎవరూ వివరించరు. ఎప్పుడు పరీక్షలు, మార్కులు, ర్యాంకులు అంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుంటారు . దాన్ని తల్లిదండ్రులు సరిదిద్దాలి.
అయితే పిల్లలు కేవలం డాక్టర్ లేదా ఇంజనీర్ మాత్రమే కావాలని అనుకోకుండా  జీవితంలో సంతృప్తిని పొందగలిగే వృత్తిలో ఉండాలని భావించాలి. ఆవిధంగా వారిని ముందుకు నడిపించాలి. ఇక జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఆఫ్‌బీట్ కోర్సులు, వృత్తి నైపుణ్యాలు, సంబంధించిన కోర్సులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి వివరాలు సేకరించండి.  పిల్లలకు ఉండే అభిరుచులు, ఆసక్తికి సరిపోయే ఒక కోర్సులో చేర్పించండి. ఈ ప్రపంచం లో విద్య కంటే ముఖ్యమైన విషయాలు చాల ఉన్నాయి.
ఇక విభిన్న వ్యక్తులతో వ్యవహరించే పద్ధతులు, పరిస్థితులను ఎదురుకోవడంలో  నైపుణ్యాలు వంటివి ఏ పుస్తకాల్లో ఉండవు. అవి తెలిసేలా చేయవలిసిన బాధ్యత పూర్తిగా మీదే అని గుర్తు పెట్టుకోండి.  పిల్లలకు ఇలాంటి నైపుణ్యాలు లేకపోతే, వారు ఎంత చదివిన  వృథా అయినట్లే. జీవన నైపుణ్యాలకు మార్కులతో అసలు  సంబంధం లేదు. ఇవన్నీ ఏ పుస్తకాల్లో దొరకవు . అందుకే భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో తల్లిదండ్రులు వారికి తెలియజేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: