పిల్లల్లో మొబైల్ పిచ్చి ఉందా.. ఈ సమస్యకు పరిష్కారాలివే..!

N.ANJI
నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్లదాకా అందరు స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడ్డారు. దీంతో పిల్లల్లో గ్యాడ్జెట్ల పట్ల ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అస్తమానం మొబైల్ ఫోన్లో ఆడుతూ, ఏదో వీడియో చూస్తూ గడపడం అలవాటుగా మారిపోయి చివరికి రొటీన్ అయిపోతుంది. పిల్లల్లో ఈ సమస్య చెక్ పెట్టొచ్చు అని వైద్య నిపుణులు వెల్లడించారు. అవి ఏంటో చూద్దామా.
పిల్లల్లో స్క్రీన్ టైం విపరీతంగా పెరగడానికి కారణం వారికి ఇక వేరే లోకం లేక డిజిటల్ ప్రపంచంలో కాలం వెళ్లదీయాల్సి రావడమే. ప్రస్తుతం కరోనా ఉన్నందున బయటకు కూడా వెళ్లలేకపోతున్న వీరికి టైం పాస్ అంటే గ్యాడ్జెట్సే. ఇంట్లో ఏమూలకు వెళ్లినా వైఫై వస్తుంది. ఇక ఎక్కడ చూసిన మొబైల్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్, ట్యాబ్లెట్, ఐప్యాడ్ వంటివి కనిపిస్తూ ఊరిస్తుంటాయి.
చాల మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తునప్పుడు ఫోన్ లో వీడియోస్ పెట్టి ఇస్తుంటారు. ఇక పిల్లలు ఓ చోట అలా కూర్చుని మొబైల్ ఫోన్ చూస్తూ గడపడం ఊహ తెలియని వయసులోనే వారికి అలవాటు అయిపోతుందని 'వాట్ పేరెంట్స్ ఆస్క్' సంస్థ పేరెంటింగ్ కన్సల్టెంట్ అండ్ ఫౌండర్ డాక్టర్ దేబ్ మిత్ర దత్తా చెబుతున్నారు. టీనేజర్లలో ప్రాణాంతకం ఆన్ లైన్ గేమ్స్ అడిక్షన్ టీనేజర్లలో ప్రాణాంతకంగా మారింది. శారీరకంగా, మానసికంగా టీనేజర్లంతా మొబైల్ పైనా అత్యధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫోన్ చేతిలో లేకపోతే, ఇంటర్నెట్ లేకపోతే వారికి ఊపిరాడనంత పనవుతుంది.
పిల్లలకు ఇండోర్ గేమ్స్ ను క్రమంగా అలవాటు చేయడం వలన కొంత మేరకు అయినా మొబైల్ పిచ్చిని అరికట్టవచ్చు. పిల్లలతో ఆడటాన్ని పెద్దలు వ్యాపకంగా పెట్టుకోవాలి. పెద్దలు స్క్రీన్ టైంను బాగా తగ్గించుకుంటే పిల్లలు కూడా అలాగే చేసే అవకాశాలు ఎక్కువ. వీలైతే కాసేపు వైఫై నియంత్రణ మీ చేతుల్లోకి తీసుకుని దాన్ని ఆఫ్ చేస్తూ, పిల్లలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చర్యలు తీసుకోండి. స్క్రీన్ డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లేవరకు పరిస్థితి తెచ్చుకోకుండా మీకు మీరే స్వయం నియంత్రణా విధానాన్ని అలవాటు చేసుకుంటే అది పిల్లల్లోనూ మార్పు తెస్తుందని వైద్య నిపుణులు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: