బుడుగు : ఎక్కువ మొబైల్ వినియోగం.. మీ పిల్లల జీవితాన్ని చేస్తుంది అంధకారం.. !!

Suma Kallamadi
ఈ కాలంలో పిల్లలు బయట పిల్లలతో ఆటలు ఆడడం కన్నా మైబైల్ ఫోన్ తో గడపడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తల్లితండ్రులు కూడా పిల్లలు అల్లరి చేయకుండా ఉంటాడులే అని ఫోన్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. ఫలితంగా చిన్నవయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ  సెల్‌ఫోన్స్ వల్ల కంటిచూపు సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పిల్లలు కూడా ఆ ఫోన్లలో కదిలే బొమ్మలకు, పాటలకు ఆకర్షితులై గంటలతరబడి వాటికే అతుక్కుపోతున్నారు. పగలు లేదు రాత్రి లేదు 24 గంటలు ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ కావడం వల్ల తీవ్రమైన కంటిసమస్యలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లలో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వంటివి చేస్తూ వాటినే లోకంగా మార్చేసుకుంటున్నారు. పైగా తల్లిదండ్రులే వాటిని తమ పిల్లల చేతికి అందించి ముచ్చటపడుతున్నారు. ఇలా సెల్‌ఫోన్ చూడటానికి అలవాటు పడి ఎలాంటి ఆటలు ఆడకపోవడంతో శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.శరీరానికి సరిపడా వ్యాయామం లేక ఉభయకాయం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే స్మార్ట్ ఫోన్లు చిన్న పిల్లల్లో అంధత్వానికి కారణమవుతున్నాయి. వాళ్లను గుడ్డివాళ్లుగా మార్చేస్తున్నాయి. ఇలా సెల్‌ఫోన్లు చూస్తూ చూపు కోల్పోతున్న కేసులు అనేకం నమోదవుతున్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు.

చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వీడియోలు చూడటం వల్ల దగ్గర దృష్టికే అలవాటు పడి దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేని పరిస్థితులు వస్తున్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్ లైటింగ్ వల్ల కంటి చూపు దెబ్బతిని వారి కళ్లు మసకగా మారడంతో పాటు చూపులో స్పష్టత కూడా కోల్పోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అందుకనే చిన్నవయసులోనే కళ్లజోళ్లు పడుతున్నాయి.. పిల్లలకు సరదాగా అలవాటు చేసిన ఫోను రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదకరం అవుతుందని గుర్తుపెట్టుకోండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: