బుడుగు : పిల్లల అల్లరి శృతి మించకూడదు అంటే..??

Suma Kallamadi
చాలా మంది పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళ అల్లరికి అంతే ఉండదు. అందుకనే పిల్లలు ఏడుపు ప్రారంభించగానే ఏడుపు ఆపేందుకు తల్లితండ్రులు వారు అడిగింది ఇచ్చేస్తారు.  అలాగే వారు ఏం అడిగినా కొనిస్తాం. అడిగిందల్లా కొనిస్తున్నాము కాబట్టి  పిల్లలు కొన్ని సార్లు మరింత మొండిగా చేస్తుంటారు.
ఒక్కోసారి కొనిచ్చే పరిస్థితులు లేకపోయినా కావాలని మారాం చేస్తుంటారు. అందుకే వారు అడిగిందల్లా కొనిపెట్టడం కాకుండా ముందుగా ఆ వస్తువు గురించి వారికి వివరించాలి. తప్పని సరయితే మాత్రమే  కొనివ్వాలి. అది ఎలా వాడతారో చూడాలి.బొమ్మలయితే వారు అల్లరి మాని ఆడుకునేందుకు పనికొస్తాయి. అదే తినే పదార్థాలయితే వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. ఏది పడితే అది తినకూడదు.
ముందుగా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. అలా కూడా వినకపోతే వారిని ఏదైనా పని చెప్పి అది పూర్తి చేస్తేనే కొనిస్తాను అని షరతు పెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే పిల్లలు మనం ఏది చెబితే అది చేసి అల్లరి మానేస్తారు. మనం ఏదన్న కొని ఇస్తామంటే వాళ్లు అందుకోసం తప్పనిసరంగా చేస్తారు. లేదా అలా అడగడం మానేస్తారు. ఒకవేళ మీరు చెప్పిన పని చేస్తే అవసరం అనుకుంటేనే కొనివ్వాలి.అదేవిధంగా చదువు విషయంలో కూడా ఇలాగే చేయాలి. ఏదైనా కోరుకుంటే ముందుగా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరిగి ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేలా తయారవుతారు. అంతే గాని పిల్లలు అడిగారని ప్రతి దాన్ని  ఇవ్వకూడదు. మొదట పిల్లలకు ఏది అడిగితే ఇవ్వటం అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా అదే అలవాటుగా మారిపోతుంది పెద్దయ్యాక కూడా అదే అలవాటుగా మారిపోతుంది. అలాగే పిల్లలకు గారాబం కూడా శృతి మించకూడదు. ఆ గారాబం వల్లనే పిల్లలు అల్లరి అనేది ఎక్కువగా చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: