బుడుగు: పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడం అంత అవసరమా.. !

Suma Kallamadi
పిల్లల్ని పెంచటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో సహనం, ఎంతో ఓపిక అవసరం. ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరికి అంతే ఉండదు.  అయితే  ఒక విషయం లో మాత్రం అందరు పేరెంట్స్ కీ హెల్ప్ కావాలి, అదే పిల్లలకి ఇప్పించే వాక్సీన్స్. కొవిడ్-19 నేపధ్యం లో పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళి, వ్యాక్సిన్స్ ఇప్పించడానికి పేరెంట్స్ జంకుతున్నారు. వ్యాక్సిన్స్ వల్ల ప్రాణాంతకమైన ఈ వ్యాధుల నుండి మన పిల్లల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఒక వ్యాక్సిన్ షెడ్యూల్ మిస్ అయినా కూడా  మ్యానేజ్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు.అసలు పిల్లలకు వ్యాక్సినేషన్ ఎందుకు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. !!


కామన్ గా సోకే ఇన్‌ఫెక్షన్స్ నుండీ, ప్రాణాంతకమైన వ్యాధుల నుండీ వ్యాక్సిన్స్ ద్వారా చాలా సింపుల్ గా మనం పిల్లల్ని రక్షించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్స్ చిన్న పిల్లల విషయం లో ఇంకా అవసరం. ఎందుకంటే, వ్యాక్సిన్స్ పిల్లల రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. పిల్లల్లో ఇమ్యూన్ సిస్టం పూర్తిగా డెవలప్ అయి ఉండదు. అలాంటి టైం లో ఇప్పించే వ్యాక్సిన్స్ వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుతాయి. పిల్లలకి ఏడెనిమిది సంవత్సరాలు వచ్చేవరకూ వాళ్ళ ఇమ్యూన్ సిస్టం ఫుల్ గా డెవలప్ అవ్వదు. అందుకనే ఆ టైం లో వాళ్లకి హెల్దీ, న్యూట్రిషస్ ఫుడ్, తో పాటూ వ్యాక్సిన్స్ కూడా అవసరం. అప్పుడే పిల్లల్ని కామన్ వైరస్ ల నుండీ, బాక్టీరియా నుండీ కాపాడుకోగలుగుతాం.


ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. వ్యాక్సిన్స్ కూడా అలాంటివే. పిల్లలకి టైం కి వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నామో లేదో తెలియడానికి ఒక వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షెడ్యూల్ మీ పీడియాట్రీషియన్ సలహాతో బిల్డప్ చేయవచ్చు. నిజానికి పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్స్ పిల్లలు పుట్టక ముందు నుండే మొదలవుతాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా వ్యాక్సిన్స్ ఇస్తారు. దాని వల్ల తల్లికి ఇమ్యూనిటీ పెరిగి ఆమె ఆ ఇమ్యూనిటీని బిడ్డకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. పిల్లలు పుట్టాక ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా స్ట్రిక్ట్ గా జరగవలసి ఉంటుంది.ఒక వేళ మీరు మీ బిడ్డ కి ఇప్పించాల్సిన వ్యాక్సిన్ షెడ్యూల్ ని మిస్ అయ్యినట్లైతే వెంటనే మీ పీడియాట్రీషియన్ ని కన్సల్ట్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవడం అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: