బుడుగు : తల్లితండ్రులు పిల్లలు అడిగిన ప్రతి దాన్ని వద్దు అంటే ఎలా.. !

Suma Kallamadi
ప్రతి ఇంట్లో తల్లి తండ్రులు చెప్పే మాట ఒకటే. పిల్లలు మాట వినడం లేదు.వద్దు అన్నా పనే చేస్తున్నారుఅని.సాధారణంగా ప్రతి తల్లి తండ్రులు పిల్లల విషయంలో వాడే కొన్ని సాధారణ మాటలు ఇవే చుడండి. వద్దన్నానా?! లే అక్కడ్నుంచి.. చెయ్యొద్దంటే వినవేంటి?ఒక్కసారి వద్దంటే ఎప్పుడూ వినవు కదా? చెయ్యొద్దన్న పనే చేస్తానంటావు,ఎప్పుడు నేర్చుకుంటావు మాట వినడం? పెట్టింది తిను, చెప్పింది చెయ్యి - అది కావాలి, ఇది కావాలి అంటే ఎక్కడ్నుంచి వస్తుంది?ఇప్పుడు కాదు రేపు వెళ్దాం? ఈ మాటలు అన్ని ప్రతి తల్లి తండ్రులు ఎదో ఒక ఒకసారి పిల్లల్ని అనే ఉంటారు. అన్ని మాటల్లో ' వద్దు ' అనే సంకేతం పిల్లలకు కనిపిస్తుంది.ఆ సంకేతం పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు.



తల్లిదండ్రుల నోట్లోనుంచేమో వద్దు అనే మాట చాలా సులువుగా వస్తుంది.తల్లిదండ్రులు వద్దు అనే పదాన్ని వాడుతూంటే, ఆ పదం యొక్క పరమార్ధాన్ని గ్రహించే సున్నితత్వం పిల్లలలో నశించిపోతుంది అని. ఆ పదాన్ని పిల్లల విషయంలో ఎంత పొదుపుగా వాడాలంటే ఆ మాట చెప్తే తప్ప పిల్లలు సమస్య నుంచి లేదా నష్టం కలిగించే పరిస్థితి నుంచి బయటపడరు అనుకునే సంధర్బంలోనే, మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదనుకున్నప్పుడే వాడాలి.సాధారణంగా పిల్లలు వద్దు అన్న పనే చేస్తారు. అలాంటపుడు తల్లితండ్రులు వద్దు అని గట్టిగా చెప్పకుండా  నువ్వు ఆ పని మానేస్తే నీకు నేను ఐస్ క్రీం, చాక్లెట్లు కొనిస్తాను, పార్కుకు తీసుకెళ్తాను అని చెప్పి చూడండి. పిల్లలు తప్పక మాట వింటారు. వాళ్ళు మీ మాట విన్నప్పుడు మీరు కూడా చెప్పింది మాత్రం తప్పక చేయండి.ఇంకా, ఐస్ క్రీం కావాలా, చాక్లెట్లు కావాలా, బొమ్మ కావాలా, సినిమాకెళ్ళాలా, పార్కుకెళ్ళాలా అంటూ చాలా ప్రత్యామ్నాయాలను చూపి, ఏం కావాలో కోరుకోమనండి.




దాంతో కొంతవరకు అదుపులోకి వస్తారు. అంతే కాని వద్దు అనే పదం వాడకండి. అది పిల్లలను అనుకూల దిశలో అలోచించనివ్వదు.వాళ్ళకు మంచి, చెడు ప్రవర్తన పట్ల వ్యత్యాసం అంతగా తెలియదు. పిల్లలు ఎలా ఉండాలని అందరూ కోరుకుంటారో, పిల్లలు ఎలా ఉంటే అందరూ ఇష్ట పడతారో పిల్లలకు బోధపరచండి. పిల్లలతో కూర్చుని ఎందుకు చేయకూడదో వివరించండి. అపుడు మీ బిడ్డ కూడా తన భావాలను మీతో పంచుకుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: