బుడుగు : మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటుంటే ఈ టిప్స్ పాటించండి.. !!

Suma Kallamadi
 చాలామంది చిన్నారులు నోట్లో వేలు పెట్టుకుని ఉంటారు.అయితే వాస్త‌వానికి శిశువు గర్భంలో ఉన్నప్పటి నుండి తమ బ్రొటనవేలును నోట్లో పెట్టుకుంటారు. ఆ అలవాటు బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగే  అవకాశం ఉంది. సంవత్సరంలోపు పిల్లలు నోట్లో వేలేసుకోవటం సహజమే.పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు, ఒంటరిగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు, తల్లి పాలు తాగాలనిపించినప్పుడు పిల్లలు నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఈ అలవాటు తల్లి పాలు తాగే పిల్లల్లో కంటే డబ్బా పాలు తాగే పిల్లల్లో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది.మాములుగా అయితే పిల్లలు రెండు మూడు ఏళ్ళు వచ్చే సరికి తమంతట తామే ఈ అలవాటును మానేస్తారు. అయితే.. కొందరు పిల్లల్లో ఐదేళ్లు వచ్చినా ఈ అలవాటు మానరు.

ఇలా నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల  దీనివల్ల పిల్లల దవడలు, దంతాల ఆకృతి మారిపోతాయి. ఈ అలవాటు ఉన్న పిల్లలు మట్టిలో ఆడుకుంటూ మట్టి అంటిన వేలిని నోట్లోపెట్టుకోవటంతో మట్టిలోని క్రిములు కడుపులోకి చేరి నులి పురుగులు, వాంతులు , విరోచనాలు , కడుపునొప్పి వంటి సమస్యలను ఎదుర్కుంటారు. అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా పిల్లలకు ఈ అలవాటును మార్పించవచ్చు.సాధారణంగా వయసుతో పాటు పిల్లలు ఈ అలవాటును తమంతట తామే మానేస్తారు. మీ పిల్లలు నిద్రపోయే టైమ్ లో మెల్లిగా వారి నోట్లోంచి వేలును తీసివేయాలి.

సంవత్సరం నిండిన తర్వాత కూడా ఆ అలవాటు మానకపోతే వేళ్లకు ప్లాస్టర్ అంటించి దానికి ఏదైనా చేదుపదార్థం రాయండి. చేదు పదార్ధం తగలడం వల్ల పిల్లలు నోట్లో వేలు పెట్టుకోరు. అలాగే  మీ పిల్లల వయసుకు తగిన బొమ్మలను అందుబాటులో ఉంచటం, వేళకు ఆహారం తినిపించటం ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చు.తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యలున్న పిల్లల్లో ఈ అలవాటును మాన్పించేందుకు మానసిక విశ్లేషకుల సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు మీ పిల్లలను ఈ అలవాటు మానుకోమని భయపెట్టటం, కొట్టటం వంటివి అస్సలు చేయరాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: