బుడుగు : మీ పిల్లలకు చెవులు కుట్టించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. !!
పిల్లలు పుట్టాక ప్రతి నెల ప్రతి సంవత్సరం.. కాదు కాదు ప్రతి రోజు పండగే.అన్న ప్రసరణ దగ్గరనుండి మొదలుకుని చెవులు కుట్టించే దగ్గర వరకు అన్ని భారతీయ సాంప్రదాయం ప్రకారం చిన్నపిల్లలకు చేస్తాము. అదే ఆడపిల్ల అయితే పోగులు కుట్టించడం అనేది ఆనవాయితీ. మాములుగా ఒక సంవత్సరం లోపు, లేదంటే మూడు, ఐదు, ఏడు ఇలా చెవులు కుట్టిస్తారు ఆడపిల్లలకు. ఇది చాలా పవిత్రమైన వేడుక.అయితే పెద్దలకు అది సంతోషంగానే ఉంటుంది గాని, పిల్లలకు మాత్రం నరకం.చిన్న పిల్లలు కదా చెవులు కుట్టిస్తే నొప్పిగా ఉంటుంది. అందుకనే తల్లి తండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
పిల్లలకు చెవులు కుట్టించే ముందు కచ్చితంగా తల స్నానం చేయించాల్సి ఉంటుంది. తర్వాత ఒక వారం మాత్రం చెవులపై చుక్క నీళ్ళు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుని స్నానం చేయించాలి. చెవులకు అసలు నీళ్ళు తగలకూడదు. అలా నీళ్లు తగిలితే చీము పడుతుంది. అదే విధంగా కొన్ని రోజుల పాటు స్టడ్స్ లేదా చిన్న చిన్న రింగులు లాంటివి పెడితే నొప్పి తగ్గడంతో పాటుగా చెవి రంధ్రం కూడా పెద్దది అవుతుంది.ఒక్కసారే పిల్లలకు బాగా బరువుగా వేలాడే చెవులవి పెట్టకూడదు.పిల్లల చర్మం లేతగా ఉంటుంది కాబట్టి సాగిపోతాయి. చెవులు కుట్టించిన రెండు మూడు రోజులు చిన్నారులకు టీ షర్ట్స్, స్వెట్టర్స్ లాంటివి వేయొద్దు. అంటే తలపై నుంచి వేసేవి అన్నమాట. గుండీలు పెట్టేవి అయితే బెస్ట్. అప్పుడు దుస్తులకు అవి పట్టుకోకుండా ఇబ్బంది లేకుండా ఉంటాయి.
చిన్న పిల్లలకు చర్మం సున్నితంగా ఉంటుంది. దీనితో వారికి చీము పట్టవచ్చు.అప్పుడు దూదితో తుడిచి కొబ్బరి నూనెతో మర్దన చేయడంతో సమస్య తీవ్రమవకుండా ఉంటుంది.మరీ పసిపిల్లలు అయితే వాళ్లకు తెలియదు కాబట్టి చెవులకు పెట్టిన కమ్మలను చిరాకుతో లాగేస్తూ ఉంటారు. ఒకవేళ బలంగా లాగితే గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళను ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి. పిల్లలు పడుకునే సమయంలో తలగడగా చాలా మెత్తగా ఉండేవి వెయ్యాలి.బెడ్ షీట్ అవి కూడా మెత్తగా ఉండాలి అలాగే దారాలు లేకుండా ఉన్నవి వేయాలి.