బుడుగు : పిల్లలకి పరీక్షలంటే భయం పోయేలా చేయండి.. !!

Suma Kallamadi

ప్రతి  పిల్లలకి  పరీక్షలంటే భయం, ఆందోళన, ఒత్తిడిలు ఉంటాయి. దాదాపు ప్రతి విద్యార్థికి పరీక్షలంటే కొద్దో గొప్పో భయంగానే ఉంటుంది. ఆ భయం వల్లనే మనకు రావాల్సిన మార్కులను కూడా పోగొట్టుకుంటాం. పరీక్షల కోసం సంవత్సరం నుంచి నేర్చుకున్న విషయాల్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది.పరీక్షల్లో 90 శాతం కంటే అధిక మార్కులు సాధించే విద్యార్థులకు ఎక్కువగా భయం, ఆందోళనలు ఉంటాయి. అయితే 40 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చే విద్యార్థులుకు కూడా భయం, ఆందోళనలు ఎక్కువగానే ఉంటాయి.అయితే ఈ భయం ,ఆందోళనను అధిగమించనట్లయితే వారు సంవత్సరం నుంచి నేర్చుకున్న పాఠాలు వృధానే.

ఎందుకంటే భయం వల్ల వారు పరీక్షలు సరిగ్గా రాయలేరు. భయం ఎందుకు వస్తుందంటే పరీక్షలకు సరిగ్గా సిద్ధంకానప్పుడు, ప్రశ్నాపత్రం లో చదివిన ప్రశ్నలు వస్తాయో, రావో అని, సమాధానాలు గుర్తుకు వస్తాయో, రావో అని పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్ళినప్పుడు, ఇన్విజిలేటర్ని చూసినప్పుడు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం ,తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన భయం ,ఆందోళన కలుగుతాయి. అయితే ఈ భయపడడం ఆందోళన వల్ల తలనొప్పి రావడం ,శరీరం వణకడం, కడుపునొప్పి వంటివి ఇబ్బంది పెడతాయి.ఈ భయం, ఆందోళన నుంచి బయటపడేందుకు ఐదు చిట్కాలను తెలుసుకుందాం.

ఇతరులతో పోల్చుకోవడం వలన ముఖ్యంగా పరీక్షల సమయంలో స్నేహితులతో నువ్వెంత చదివావు అని అడగడం, వారు నేను మొత్తం చదివేశాను లేదా నేను అసలు చదువు లేదు అనే సమాధానాలు మీ మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ మీ స్నేహితుడు నేను మొత్తం చదివేసాను అని చెప్తే మీరు మొత్తం కొద్ది సమయంలోనే ఎలా చదవాలో అని ఆలోచిస్తూ మీలో భయం పుడుతుంది.లేదా వారు నేను చదవలేదు అని చెప్తే మీరు కూడా చదవలేదు కదా అనుకొని మీరు కూడా చదవరు.కాబట్టి పరీక్షల సమయంలో స్నేహితుల గురించి ఆలోచించకుండా కేవలం మీ గురించి మీరు ఆలోచించుకోవడం మంచిది.

నేను బాగా చదివాను, నేను బాగా రాయగలను ప్రశ్నాపత్రం నేను అనుకున్న విధంగానే వస్తుంది పరీక్ష హాల్లో నేను ఏ విధంగా భయపడను అని మీకు మీరే సలహాలు తీసుకోవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షలకు చదివేటప్పుడు గంటలు గంటలు చదవకుండా చదివే సమయంలో విరామాలు ఇవ్వడం చాలా ముఖ్యం.ఈ విధంగా విరామం ఇస్తూ చదవండి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: