ఓహోహో బాలమ్మా ఒళ్లంతా ముళ్లమ్మా కరకర కోస్తే కడుపంతా తీపమ్మా- ఏంటదీ ?

Durga
 1.ఓహోహో బాలమ్మా ఒళ్లంతా ముళ్లమ్మా కరకర కోస్తే కడుపంతా తీపమ్మా- ఏంటదీ ?  2. కాయమీద మాను, కడు రమ్యమై యుండు- లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు దీని భావమేమి తిరుమలేశ  3. అడవిని పుట్టాను నల్లగ మారాను ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను కుప్పలో పడ్డాను తెల్లగా మారాను  4.అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది చెంబులో నీళ్లని చెడ త్రాగుతుంది. 5. ఇంటివెనుక వెంపలి చెట్టు యే యాయ కాయమంటే ఆ కాయ కాస్తుంది. విడుపులు : 1. పనస పండు 2. వీణ 3. బొగ్గు 4. గంధపు చెక్క 5. కుమ్మరిసారె  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: