మాటే మనిషిని మన్ననను తెస్లుందని స్వామి వివేకానంద తన బోధనల్లో పేర్కొన్నారు. మాటను బట్టి మనిషికి విలువ ఉంటుంది. కనక మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని నొప్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని చెప్పి అసత్యాలు ఆడవలసిన పనిలేదు. ఎదుటి వారికి అప్రిమయమైన విషయాలను చెప్పాల్సి వస్తే నర్మగర్భంగా తెలియజేయాలి. మన నాలుకు మీద లక్షీదేవి పడయాడుతుందనీ, ఆ నాలుకు మీదే స్నేహాలూ, బంధుత్వాలు పాదుకుని అభివృద్ధి చెందుతాయని స్వామివివేకానంద పేర్కొన్నారు. నిజాయితితో వ్యవహరించడం ఎంత అవసరమో, నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కూడా అంతే అరిష్టమని ఆయన అన్నారు. మహాభారత యుద్దంలో ద్రోణాచార్యుడి చేత అస్త్ర సన్యాసం చేయించడం కోసం ‘అశ్వద్ధామ హత: కుంజర:’ అని ధర్మారాజు చేత భగవానుడు చెప్పిస్తాడు. అశ్వత్థామ అనే ఏనుగు మరణించిందని చెప్పడానికి ఆయన ఉపయోగించిన ఈ పద ప్రయోగం వల్ల తన కుమారుడైన అశ్వత్థామ మరణించాడనుకుని ద్రోణాచార్యడు అస్త్ర సన్యాసం చేస్తాడు. ఈ పురాణ గాధను మనం తరచు వింటు ఉంటాం. అలాగే సీతామాత కోసం వెదుకుతూ తారసపడిన శ్రీరామ లక్ష్మణుల వద్దకు ఆంజనేయుడు ఒక బిక్షువు రూపంలో వెళ్ళి తానెవరో, ఎందుకు వచ్చానో తెలియజేస్తాడు. అలా చేయడం వల్ల ఆయనకు మంచి జరిగింది. ఆంజనేయుడి నిజాయితిని రామలక్ష్మణులు గ్రహించి ఆయన వెంట సుగ్రీవుని వద్దకు వెళ్లారు. రామ, సుగ్రీవులను కలిపిన ఆంజనేయుడు సీతామాత అన్వేషణలో సాయపడిన తీరు సుందరకాండలో ఎంతో విఫులంగా, విస్తారంగా వాల్మీకి మహర్షి వివరిస్తాడు. ఆంజనేయుడికి తన బలం ఏమిటో తన బలం ఏమిటో ఆయనకు తెలియడు. ఎల్లవేళలా రామనామాన్ని జపించడం వల్లనే ఆంజనేయుడు శతయోజనాల విస్తీర్ణం కలిగిన సాగరాన్ని ఉల్లంఘించి లంకా నగరానికి చేరుకోగలిగాడు. అశోక వనానికి చేరుకుని సీతామాతను కనుగొనగలిగాడు. రామలక్ష్మణుల వద్దకు బిక్షువు వేషంలో వెళ్లి తానెవరో చెప్పిన ఆంజనేయుడు, అశోకవనంల తన అసలు రూపంలోనే సీతామాత దర్శనాన్ని చేసుకున్నప్పటికీ, ఆమెకు తానెవరో నేరుగా చెప్పకుండా, రామకథాగానంతో ఆమెను ప్రసన్నం చేసుకుంటాడు. ఆమె సందేహాలన్నీంటినీ నివృత్తిచేస్తాడు. అయినప్పటికీ సీతామాత శ్రీరాముడి గుణగణాలన వర్ణించిన తరువాత కానీ ఆంజనేయుడిని నమ్మదు. కనుక, మనం ఎల్లవేళలా నిజాన్నే చెప్పాల్సి ఉన్నా, సమయసందర్భాలను బట్టి నర్మగర్బంగా చెప్పడం కూడా అవసరమేనని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అందుకే, ఆచి తూచి మాట్లాడాలని స్వామి వివేకానంద ఉద్భోదించారు. మనిషిని సన్మార్గంలో పెట్టేందుకు రామాయణ, మహాభారత కథలు ఎంతో ఉపయోగపడుతాయి. గతంలో హరికథలు యక్షగానాలు, బుర్రకథలు, పౌరాణిక నాటకాల ద్వారా రామాయణ, భారత కథలు తెలసుసుకునే అవకాశం పిల్లలు, యువకులకు లభించింది. వాటికి ప్రోత్సాహం కరవుఅవడంతో నేటి తరం దురదృష్టం.
మరింత సమాచారం తెలుసుకోండి: