అత్యాశ కూడదు !

Durga
ఒకప్పుడు ఒక పేదవాడు ఒక వేవతానుగ్రహంతో మూడు వరాలను పొందాడు. ఒక్కోవరం కోరుకున్నప్పుడు ఆతడు ఒకసారి పాచికలను దొర్లించాలని దేవత నియమం. అతడు బ్రహ్మానందంపొంది. యింటికి వెళ్లి భార్యకు తన మహాదృస్టాన్ని గూర్చి తెలపగా, ఆమె మొట్టమొదట ధనంకోసం పాచికలను విసరమని కోరింది. అందుకు అతడిలా అన్నాడు. ‘‘ మన ఇద్దరి చిన్నముక్కులూ చాలా రోత కలిగిస్తున్నవి, లోకులు మనలను చూసి నవ్వుతున్నారు. అందుచేత చక్కని కొనదేరిన ముక్కులకోసం మొట్టమొదట పాచిలకును దొర్లిద్దాం’’ కాని అతడి భార్య అన్నిటికంటే ముందు ధనం కావాలని పట్టపట్టి అతడు పాచికలను దొర్లించకుండా చేతిని పట్టుకొంది. కాని అతగాడు వెంటనే చేతిని లాగుకొని ‘ మా ఇద్దరికీ చక్కని ముక్కులు లభించగాక, ముక్కులే మరేమీ వద్దు’’ అంటూ తొందరగా పాచికలను దొర్లించాడు. తక్షణమే వారి శరీరలు యావత్తు చక్కని ముక్కులతో నిండిపోయాయి. కాని అవి వారికి పరమఉపద్రవాలై దుర్భరమనవటంతో, ’‘‘ మహాప్రభూ, మా కీ ముక్కులు తోలగుగాక!’’అంటూ రెండవసారి పాచికలను దొర్లించటానికి యిద్దరూ ఒప్పుకొన్నారు. దొర్లించారో లేదో యిద్దరికీ మొదటవున్న ముక్కులుకూడా ఊడిపోయాయి. ఈ విధంగా వారు రెండు వరాలను వృధాపుచ్చారు. ఏం చేయటానికి వారికి పాలుపోలేదు. ఒక్కవరమే ఇక మిగిలివుంది. ముక్కులు ఊడిపోవడంతో మునపటికంటే వారు మరింత కురూపులుగా కనిపించసాగారు. లోకాన్ని ఏ ముఖం పెట్టుకొని చూస్తామా అని వారు వాపోయారు. వారు తమకు చక్కని ముక్కలు కావాలని కోరుకున్నా లోకులు తమకు ఏర్పడ్డ ఇ వికృతరూపాన్ని గురించి ఏమని అడిగిపోతారో, అని వారు భయపడ్డారు.  కాబట్టి వారిద్దరూ తమ ఏప్పటి వికారపు చిన్న ముక్కులనే తిరిగి పొందటానికి సమ్మతించి పాచికలను దొర్లించారు. సంసారాన్ని త్యజిస్తేనేగాని సమస్త ప్రపంచం నీదే అనే ఎరుక నీకు అలవడదు. సంసార త్యాగానంతరమే నిన్నదిబద్దుణ్ణి చేయటం మానుతుంది. శారీరకంగా త్యజించలేకుంటే మానసికంగా పరిత్యజించు, వైరాగ్యం కలిగి మసలుకో ఇదే నిజమైన త్యాగం, అది లేకుంటే ఆత్మసిద్ది పొందలేవు దేన్నీ కోరుకోవద్దు, ఎందుకంటే దేన్ని కోరతావో అదే నీకు లభిస్తుంది, దానితోనే కాని మనకు మోక్షం దక్కదు. ‘‘ఉద్దరేదాత్మ నాత్మానమ్ తన చేతనే తనను ఉద్దరించుకోవాలి.’’ 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: