నిండుగర్భణి అయిన ఒక సింహం, ఆహారంకోసం తిరుగుతూ, ఒక గొర్రెల మందను చూచి దాన్లోకి దుమికింది. కానీ ఆ శరమకు ఓర్వజాలక, ఈని అది వెంటనే మరణించింది. దాని బిడ్డ, గొర్రెల పోషణ కిందనే పెరిగి, వాటితోపాటు గడ్డి మేస్తూ, వాటిలాగానే గొర్రె అరపు అరుస్తూండినది. పెద్దదైన తర్వాతకూడా, తాను గొర్రె అనే దాని తలుపు. మరొక సింహం ఒకనాడు, ఆ ప్రాంతినికి ఆహారార్థం వచ్చి, ఆ మందలో సింహం ఉండటం, గొర్రెలలాగా అదీ పారిపోవడమూ చూసి ఆశ్చర్యపోయింది. దాని దగ్గరకు వెళ్లి ‘‘నువ్వు సింహానివి’’ అని దానికి చెప్పింది. ‘‘కాదు నేను గొర్రెనే’’ అంటూ అది గొర్రె అరుపు అరిచింది. అంతట ఈ సింహ దాన్ని ఒక చెరువు దగ్గరికి లాక్కునిపోయి, తమ ఉభయుల ప్రతిబింభాల్ని చెరువు నీటిలో చూపిస్తూ ‘బాగా చూడు, నువ్వు ఎవరివో యిప్పుటికైనా తెలుసుకో’’ అన్నిది సింహం. అంతట, ఆ ‘‘ గొర్రె – సింహ’’ నీళ్లలో కనిపించే తన ప్రతిబింభాన్ని, ఆ సింహాన్ని పోల్చిచూసుకొన్నది. క్షణమాత్రంలో తాను సింహమనే సత్యం దానికి స్పురించింది. వెంటనే దాని గొర్రె అరుపు మాయమై, సింహగర్జన వెలువడింది. మనం అపరిశుద్ధులం అని ఎన్నడూ అనకండి పరిశుద్ధులమనే అనండి మనం స్వల్పులమనీ, జన్మిస్తామనీ, మరణిస్తామనీ గాఢభ్రాంతిని ఒకదాన్ని కల్పించుకొని ఉన్నాం. అందువల్ల మనల్ని ఎప్పుడూ అకారణ భీతి వెన్నాడుతోంది. సింహాలు మీరు ! నిత్యం పరిశుద్ధం, పరిపూర్ణం అయిన ఆత్మయే మీరు విశ్వశక్తి మీలో అణిగివుంది. ‘మిత్రమా ! ఏడుస్తున్నా వెందుకు ? నీకు జననమరణాలు లేవు, వ్యాధి దు:ఖలు లేవు అనంతమైన ఆకాశం వంటివాడిని నువ్వు. రంగు రంగుల మబ్బులు దాని నావరించి, ఒక క్షణమాత్రం క్రిండించి మాయమౌతూ ఉంటవి, కారీ, ఆకాశ మెప్పుడూ, నిత్యవినీల కాంతిమయమే, దుర్జనత్వం మనకేల కనిపిస్తుంది?’’ ’నేను ఆత్మను, విశ్వంలో ఏదీ నన్ను చంపలేదు’ అని మానవుడికి వ్యక్తపరచే ధైర్యాన్ని అలవరచుకోండి, అప్పుడు మీరు ముక్తులవుతారు. ఆత్మసాక్షత్కారాన్ని పొందుతారు. ఈ ఆత్మను గురించి వినాలి, పిదప మననం చేయాలి. తదనంతరం నిరంతర ధ్యానం చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: