పొడుపు కథలు కథ విప్పండి :
1) దేహమంతా కళ్ళు ఉండును, కానీ దేవేంద్రుడిని గాను, నరుడి తోడు లేక నడువలేను, నేను ప్రాణిని కాను. పట్టి ప్రాణాలు తీస్తాను. నేనవరినీ?
2) చల్లని బంతి తెల్లని బంతి – అందని బంతి ఏమిటది?
3) జీడివారి, సిరిగల వారికి ఆడపడుచు, వయసులో కులికే వయ్యారి- వైశాఖ మాసంలో వస్తుంది. ఏమిటది?
4) గూటిలో ఉంటాము గువ్వలం కాము, చుట్టూ కాపలా ఉంటుంది. కానీ రాజులు కాము, న్యాయధర్మాలు తెలిసిన న్యాయమూర్తులం కాము, ఎవరు మేము ఎవరూ?
5) సన్నని దంతాలున్నాయి కానీ ఎలుకును కాను, కుచ్చుతోక నాకున్నది కాని నక్కను కాను, చేసితిని శ్రీరామునికి సాయం- కానీ కోతిని కాను మరినేనెవరి?
6) పదములారు కలవు బంభరంబు కాదు, తొండం ఉంది కానీ దొమకాదు, రెక్కలుండు గానీ పక్షి కానేరదు- అయితే మరేమిటి ?
7) కాను(?) మీద మాను కడు రమ్యమై యుండు- మాను మీద లతలు మలయుచుండు- లతల మీద వేళ్లు నాట్యమాడు- నేనెవరిని?
8) కొండ కింద గుండు
9) పచ్చని చెట్టు కింద ఎర్రని పెళ్లి కొడుకు
10) మీ తాతా బోడేడే, మా తాతా బోడేడే,సిద్దయ్య బోడేడే, శివలింగం బోడేడే.
11) కాళ్లు లేని పిల్లవాడు గాలిలోకి ఎగిరినాడు, ఎంటది?
12) ప్రశ్నిస్తుంది, బెదిరిస్తుంది. గౌరవిస్తుంది. ఏమిటది?
కథ విప్పండి! (జవాబులు)
1) వల
2) చందమామ
3) మామిడిపండు
4) కళ్లు
5) ఉడత
6) ఈగ
7) వీణ
8) కొప్పు
9) పండునిరపకాయ
10)కాళ్లమంచం
11) గాలిపటం
12) క్యా,? బే, ! జీ !!
మరింత సమాచారం తెలుసుకోండి: