మితిమీరిన ఆశ

Durga
      ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ అన్నీ తనకే కావాలనే పేరాశ. కానీ అది చిన్న జంతువు కదా ! అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో. పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని అది జీవనం చేస్తుండిది.           ఇలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజానవేసుకొని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవవిపంది కనిబడింది. వెంటనే గురిచూచి ఆ పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురితప్పి తగలడం వల్ల పందికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు.    అది కోపంతో వేటగాడి పైకి దూకి అతనిని చంపి మరికొంత సేపటకి పంది కూడా చచ్చింది. ఆ పంది విలవిల తన్నుకుంటుండగా అటుగా వస్తున్న ఒక పాము దాని కిందపడి నలిగి చచ్చింది. ఆ దారినే వస్తున్న్ నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము, వేటగాడిని చూసింది.    ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో దాని సంతోషానికి అంతులేదు. నక్కకు అసలే దురాశ కదా! వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ‘‘ఈ నాల్గింటి మాంసం తరువాత తాపీగా తినవచ్చు.    ముందు ఈ నరంతో ఈ పూటకి సరిపెట్టుకుందాం’’ అని ఆ బాణానికి బిగించి ఉన్న నరాన్ని కొరికింది నరం తెగటంతో వంగి ఉన్న బాణబద్ద ఊపుగా నిటారుగా సాగి, నక్క గుండెలకు గట్టిగా గుద్దుకున్నది.  ఆ దెబ్బకు నక్క అక్కకక్కడే మరణించింది. ఈ కథలోని నీతి : దురాశ దుఖ: చేటు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: