నాతప్పుకు అతడే బాధ్యుడు

Durga
ఒక బేకరి యజమాని తనకు వెన్నను సరఫరా చేస్తున్న రైతుపై అనుమానం వచ్చి, అతను తెచ్చిన వెన్నను తూకం వేయించాడు. ఆ అనుమానం నిజమైనది. వెన్న బరువు తగ్గింది.. యజమానిరైతుపై కోపం వచ్చి పోలీసులకు పిర్యాదు చేసి అరెస్టు చేయించాడు. కేసు విచారణకు వచ్చింది. నీ దగ్గర తూకంరాళ్లు ఉన్నాయి. అనుకుంటాను అని న్యాయధికారి రైతును ప్రశ్నించాడు. లేవు అని రైతు చెప్పాడు. మరైతే వెన్నను నీవు ఎలా తూచేవాడివి అని న్యాయాధికారి అడిగాడు. బేకరీ కొట్టు యజమాని నా వద్ద నుండి వెన్న కొనడం ప్రారంభించినప్పటి నుండి అతనివద్దే నాకు కావాలసిన బ్రెడ్ ను కొనాలని నిర్ణయించుకున్నాను. ఆనాటి నుండి ఆయన అమ్మె ఒక పావుకిలో బ్రెడ్ ను తూకంగా వాడి నేను వెన్న అమ్మడం ప్రారంబించాను. నును అమ్మిన వెన్న తక్కువ తూగిందంటే దానికి బాధ్యుడు, కారణం ఆ బేకరీ షాపు యజమానే కారణం అని రైతు సమాధానమిచ్చాడు. తక్కువ తూకంతో బ్రెడ్ తయారు చేస్తున్నది బేకరీ షాపు యజమానేనని న్యాయాధికారి షాపు యజమానికి శిక్షవిధించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: