బుడుగు : టీవీ రిమోట్ కంట్రోల్ మీ పిల్లలకు ఇస్తున్నారా.. !! అయితే తస్మాత్ జాగ్రత్త.. !!

Suma Kallamadi
చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే తిండి విషయంలో గాని, వస్తువుల విషయంలో గాను శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే అపరిశుభ్ర వాతావరణం వల్ల పిల్లలకు అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ కు గురి అవుతారు. అదేంటంటే  మీ ఇంట్లో  టీవీ ఉంటే మీ పిల్లలు చిక్కుల్లో పడ్డట్లే.. టీవీ వల్ల కాదండోయ్. ఛానెల్స్ మార్చే  చిన్న రిమోట్ వల్ల అండి.. అవును మీరు విన్నది నిజమే..  పిల్లలకు రిమోట్ ఇచ్చేసి వారికి నచ్చిన ఛానెల్ చూడనిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు అని మీరు అనుకుంటున్నారు. కానీ  స్వేచ్ఛ పేరుతో  వారికీ అనారోగ్యాన్ని కూడా పంచుతున్నారు అని తెలుసుకోండి. ఒక రీసెంట్ సర్వే ప్రకారం ఇంట్లో ఉన్న అతి మురికి వస్తువుల్లో టీవి రిమోట్ ఒకటి అని తేలింది.

 వ్యాధులను వ్యాప్తి చేయడంలో టీవీ రిమోట్ కీలక పాత్ర పోషిస్తుందట. టాయిలెట్ సీటుకన్నా టీవీ రిమోట్ 20 శాతం అధిక మురికిగా ఉంటుంది....యూకేలో ఉన్న ScS అనే సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. ఇంట్లో ఉండే వస్తువుల్లో ఎక్కువగా వినియోగించబడే రిమోట్ లో అత్యధికంగా బ్యాక్టీరియా, వైరస్ ఉంటుందట. ఈ సర్వే ప్రకారం టాయిలెట్ సీటుకన్నా టీవీ రిమోట్ 20 శాతం అధిక మురికిగా ఉంటుందని వెల్లడించారు.అయితే మన ఇంట్లో ఉండే ఈ వస్తువులు టాయిలెట్ కన్నా దారుణం అని అంటున్నారు పరిశోధకులు.. ఇందులో డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్ లో ఉన్నా కార్పెట్, బాత్రూమ్ లో కూడా అత్యధిక శాతం బ్యాక్టీరియా ఉంటందట.

 డోర్ హ్యాండిల్స్ పై కూడా బ్యాక్టిరియా తిష్ట వేసుకుని ఉంటుందట.రిమోట్ పై ఉండే అధిక శాతం బ్యాక్టిరియా గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో నాలుగు చేతులు మారే రిమోట్ వల్ల వ్యాధులు సులభంగా వ్యాపించే అవకాశం ఉందట. అందులోను ముఖ్యంగా పిల్లలు రిమోట్ ను ఎక్కువగా వాడుతుంటారు.  దీని వల్ల పిల్లలు ఎక్కువగా ఆనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉందట.అందువల్ల  పిల్లలకు రిమోట్ ను  కాస్త దూరంగా పెట్టడం మంచిది. అలాగే రిమోట్ వచ్చాక శారీరక శ్రమ అనేది చాలా తగ్గిపోయింది. దీనివల్ల ఉభయకాయం వచ్చే ప్రమాదం కూడా ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: