బుడుగు : పిల్లల పెంపకం విషయంలో కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకోండి.. !!

Suma Kallamadi
చాలా మంది తల్లితండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంతో గొప్పగా పెంచాలని అనుకుంటారు. అయితే మీరు మీ పిల్లవాణ్ణి చక్కగా పెంచాలనుకుంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే ముందు మీరు ఆనందంగా ఉండి తీరాలి. ఆందోళన, కోపం, భయం, ఆదుర్దా, అసూయ, వీటిపై ప్రతి రోజూ మీ ఇంట్లో ఒక ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది. మీ పిల్లవాని ముందు ఈ విషయాలే ప్రదర్శింపబడుతూ ఉంటాయి. అప్పుడు అతడు అవే నేర్చుకుంటాడు. మీ పిల్లవాణ్ణి చక్కగా పెంచాలనే ఉద్దేశ్యం మీకు నిజంగా ఉంటే, ముందు మీరుండే తీరును మీరు మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు పరివర్తనం చెందించుకునే సామర్ధ్యం మీకు లేకపోతే, ఇక మీ పిల్లవాణ్ణి మీరు ఎలా సమర్ధవంతంగా పెంచుతారు చెప్పండి.. !!

పిల్లవాణ్ణి ప్రేమ పూర్వకంగా పెంచటం అంటే అతనికి అడిగినదల్లా ఇవ్వటమే అని చాలా మంది అనుకుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీ పిల్లలకు అడిగిందల్లా ఇస్తే రేపు మీ అంతస్థుకు తగని వస్తువు అడుగుతాడు. అప్పుడు ఏమి చేస్తారు..??  అందుకనే మీ పిల్లవాణ్ణి కొంచెం విజ్ఞతతో పెంచండి. అప్పుడు అతడు అడిగినదల్లా తెచ్చి ఇవ్వటం ఒట్టి మూర్ఖత్వమే అని మీకు తెలుస్తుంది.


అలాగే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ ఇంట్లో ప్రేమాదరణలతో నిండిన వాతావరణాన్ని కల్పించటమే మీ పని. ఆ ఒక్కటి ఖచ్చితంగా చూసుకోండి మీరు. కోపంగా ఉండటం అంటే ఏమిటో, దీనంగా ఉండటం అంటే ఏమిటో, ఏడవడం అంటే ఏమిటో, మీ పిల్లలు ఎప్పటికీ చూడకూడదు. మీ ఇల్లు ప్రేమానందాలతో నిండి ఉండేలా చూడండి. ఇక వారు అద్భుతంగా పెరుగుతారు.ఎటువంటి పరిస్థితులను అయిన తట్టుకునేలాగా వాళ్ళు ఉల్లాసవంతంగా జీవించ గలగాలి. ఆ రకంగా వాళ్ళను పెంచండి. వాళ్ళు పెరగవలసిన తీరు అదే..మీ పిల్లవాని చుట్టూ ప్రశాంతవంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి.అలాగే  పిల్లలను ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యంగా ఉండేలాగా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: