బుడుగు : పసి పిల్లలు ఎంత నవ్వితే అంతా ఆరోగ్యం అంట తెలుసా.. !!

Suma Kallamadi
ఇంట్లో పసిపిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా.. !! వాళ్ళ బోసినవ్వులు, చిలిపి చేష్టలు, అల్లరి చూస్తే చాలు ఎంతటి భాధ అయిన సరే ఇట్టే మర్చిపోతాము. పిల్లలతో సమానంగా పెద్దలు  అడే అటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహపరచటమే కాదు వారి శారీరక, మానసిక అరోగ్యానికి ఎంతో అవసరం. లల్లాయి పాటలు పాడుతూ పసిబిడ్డను కొద్దిగా అటు, ఇటు ఊపి చూడండి. వెంటనే అ పసి ముఖం మీద బోసినవ్వు మెరుస్తుంది. ఒకోసారి మన ఆటలకి నోరారా నవ్వుతారు. పక పకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందట. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిది.

ఎప్పుడన్నా  పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం లాంటివి చేసారా.. !! అలా గాల్లోకి ఎగరేసినపుడు ఆ బుజ్జాయి పెదవుల మీద ఉండే నవ్వు చూస్తే చాలు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. అలా నవ్వడం అనేది బుజ్జాయికి ఆరోగ్యం అంట.  అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని లాలిపాట పాడుతూ  ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం, వంటి వన్నీ పిల్లలకి కేవలం ఆటలగా సరదాగా అనిపిస్తాయి. కానీ, నిజానికి  బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వల్ల  ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటివల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని గుర్తించారు కూడా.

బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో" సెన్సరీ వ్యవస్థ" చక్కగా మెరుగుపడుతుంది.  దీనివల్ల నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే న్యూరాల్ నెట్వర్క్స్ మెరుగై, మెదడు మరింత చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు.తెలిసో తెలియక మనం చేసే ఈ పని వల్ల పాపాయి మెదడు అభివృద్ధి చెందుతుంది.చిట్టి పొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివృద్ధి చెందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: