ద్రౌపది 5 గురు భర్తలతో ఎలా కాపురం చేసింది?

Veldandi Saikiran
ద్రౌపది దృపదరాజు కుమార్తె. మహాభారతంలో కీలక పాత్రధారి ద్రౌపది. ఇంద్రుని భార్య శచీదేవి పాక్షిక అవతారంగా ద్రౌపదిని పేర్కొంటారు. సంతానం కోసం దృపథుడు నిర్వహించిన యజ్ఞం నుంచి ధ్రుష్టధ్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు. అనగా ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా జన్మించలేదు. ఏకంగా యుక్త వయసుతో జన్మించింది. అందువల్లే ఈమెను యజ్ఞసేని అంటారు. యజ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. అయితే, పాండురాజు భార్యలైన కుంతీమాద్రిలు దుర్వాసన మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచ పాండవులకు తల్లులయ్యారు.

అలా యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్వినీ దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచప్రాణాలను పంచపాండవులుగా అనుగ్రహించి.. జన్మనెత్తేలా చేస్తారు. కాబట్టి పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. మత్స్య యంత్రాన్ని చేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. ఇంటికి వచ్చి రాగానే అమ్మ నేను ఒక మంచి బహుమతిని గెలుచుకొని తెచ్చాను అని తల్లి కుంతితో అంటాడు. దీంతో ఐదుగురు సమానంగా పంచుకోండి నాయనా అని తల్లి అంటుంది.  దీని ఫలితంగా పాంచాలిగా మారింది ద్రౌపది. తల్లి కుంతీదేవి ఆదేశం ప్రకారం పాండవులు అందరూ ఆమెకు భర్తలు అయ్యారు. వ్యాసుని సమక్షంలో ఆమెను పాండవులు ఐదుగురు వివాహం చేసుకున్నారు.

వారి వల్ల ద్రౌపదికి ప్రతిబిధుడు, సుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శృత కర్ముడు అనే ఉపపాండవులు జన్మించారు. ఇక ఐదుగురు భర్తలతో కాపురం చేసేటప్పుడు ద్రౌపది చాలా నియమాలు పాటించేది. ఓ భర్త నుంచి మరో భర్త దగ్గరకు వెళ్ళేటప్పుడు అగ్నిలోంచి నడిచి వెళ్ళేది. పునీతుల్ని చేయడంలో అగ్నిని మించిన దైవమేముంది. అలా అగ్నిలో నడిచి వెళ్లేటప్పుడు ఆమె పవిత్రతను పొందేది. ద్రౌపది తన భర్తలతో సక్యతగా మెలిగేది. వారి మధ్య గొడవలు రాకుండా ఉండేది. ఇందుకోసం పాండవులు కూడా ఓ నియమం పెట్టుకున్నారు.  ద్రౌపది కొన్ని నెలల పాటు ఒక్కొక్కరి దగ్గర ఉంటూ వచ్చేది. ఆ సమయంలో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్లకూడదని.. అలా వెళితే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: