హరిదాసుల చరిత్ర : సాయం చేస్తే ఎంత మంచిదో తెలుసా..!

MOHAN BABU
సంక్రాంతి పండుగ వచ్చిందంటే  గ్రామాలలో హరిదాసుల సందడి మొదలవుతుంది. హరిదాసులు వారి పాటలతో, ఆటలతో మైమరపించి ఊళ్లో పండగ వాతావరణాన్ని తీసుకు వస్తారు. అసలు హరిదాసులు అంటే ఎవరు.. వారు సంక్రాంతి పండుగ పర్వదినం ఎందుకు వస్తారు.. తెలుసుకుందాం..? హరిదాసు అనే పేరుతో పూర్వం సాతాని వైష్ణవులు ఉన్నారు. వీరు ఎలా ఉంటారంటే ఎవరితో మాట్లాడారు మౌనవ్రతంతో ఉండి కేవలం హరినామ స్మరణ మాత్రమే చేసుకుంటూ, ఇక ఎవరితో ఏమి మాట్లాడకుండా ఉంటారు. వీరు నెత్తి మీద ఒక గిన్నె పెట్టుకుని, ఆ గిన్నెను పూలమాలలతో అలంకరించి హరి స్మరణ చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఎవరైనా ధాన్యాన్ని వారికి వేస్తే తీసుకుంటారు కానీ, అక్కడికి వెళ్లి ఒత్తిడి మాత్రం చేయరు.

 అయితే సంక్రాంతికి సాక్షాత్తు విష్ణువు హరిదాసు రూపంలో మన ఇళ్ళ లోకి వస్తారని నమ్ముతారు. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని నమ్ముతారు. ఆ పాత్రని హరిదాసులు నేలమీద పెట్టరు. వారి బిక్ష పూర్తయి ఇంటికి వెళ్ళాకే దాన్ని కిందకు దించుతారు. అంటే వీరు మనకు ఏం చెబుతున్నారంటే  మానవుడు పుట్టాక హరినామస్మరణ తప్పకుండా చేయవలసిందేనని,  హరినామస్మరణ చేయాలని, చేయించాలని, సహనాన్ని నేర్చుకోవాలని, మరి ఇందులో సహనాన్ని ఎలా నేర్చుకుంటాం అంటే ఇంతటి చలికాలంలో తెల్లవారుఝామున నాలుగు గంటలకే చల్లని నీటితో స్నానం చేసి మంచి దుస్తులు వేసుకొని పూల మాలలు ధరించి అంతటా తిరుగుతూ హరినామస్మరణ చేస్తారు.

 అంటే తపస్సు అనేది మన శరీరాన్ని మనస్సును ఏకాగ్రం చేసి చలికి తట్టుకునేలా చేస్తుందని చరిత్ర చెబుతుంది. దీని ద్వారా మనిషికి ఏకాగ్రత పెరిగి చేసే పనిపై పట్టు కూడా పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కష్టకాలంలో టెక్నాలజీ పెరిగిపోవడం, డబ్బు వాల్యూ పడిపోవడం, పండగ అంటే యూట్యూబ్ లోనో, వెబ్సైట్లలోనూ  చూసి తెలుసుకో వలసిన పరిస్థితి ఏర్పడింది. హరిదాసులు గంగిరెద్దుల జాడే కరువైపోతుంది. ఆనాటి రోజులు మళ్లీ రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: