50 ఏళ్ల విజయ్ దివాస్

D.V.Aravind Chowdary

 భారత దేశ  చరిత్రలో డిసెంబర్ 16 కు ఎంతో ప్రాధాన్యం ఉంది , ఎందుకంటే ఈరోజు విజయ్ దివాస్. ప్రస్తుతం 50 వ విజయ్ దివాస్ ను జరుపుకుంటున్నాము .అసలు ఏమిటి ఈ విజయ్ దివాస్ ? ప్రతియేటా  భారత దేశంలో  విజయ్ దివాస్ ను ఎందుకు జరుపుకుంటున్నారు ? బంగ్లాదేశ్  స్వాతంత్య్రం కోసం భారత దేశం ఎందుకు పోరాడింది? 


పై ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే  చరిత్రలోకి ఒకసారి తొంగిచూస్తే బ్రిటిష్ వారి కుటిలత్వం కారణంగా 1947 ఆగస్టు 14 న అఖండ భారతదేశం పాకిస్థాన్, భారత దేశం గా విడిపోయింది. నూతన దేశమైన పాకిస్థాన్ లో పశ్చిమ పంజాబ్, సింధ్ , బాలుచిస్తాన్ మరియు తూర్పు బెంగాల్ ప్రాంతాలు భాగమయ్యాయి. తూర్పు పాకిస్థాన్(బెంగాల్ రాష్ట్రం) ప్రాంతం భౌగోళికంగా, సాంస్కృతికంగా పాకిస్థాన్ లోని మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఉండటమే కాకుండా ఇక్కడి అత్యధిక శాతం ప్రజలు విద్యావంతులు మరియు ఆధునికులుగా వ్యవహరించబడేవారు. 

తూర్పు పాకిస్థాన్ ప్రజల మీద ఆధిపత్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకున్న పశ్చిమ పంజాబ్ ప్రాంతానికి చెందిన ముస్లిం నాయకులు బెంగాల్ ప్రాంతానికి చెందిన వారికి విద్య, ఉద్యోగ కోటాల్లో మరియు రాజకీయాల్లో సరైన అవకాశాలు దక్కకుండా చేస్తూ వారిని అణిచివేత కు గురిచేసేవారు. అంతేకాకుండా మాతృభాష బెంగాలీ కాకుండా వారి మీద ఉర్దూ మరియు పంజాబీ భాషలను బలవంతంగా రుద్దుతూ రావడాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థి నాయకుడు షేక్ మూజిబుర్ రెహ్మాన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, సామాన్య ప్రజలు నిరసనలకు దిగడంతో పాకిస్థాన్ పాలకులు వెనక్కి తగ్గిన కానీ తరువాత కాలంలో కూడా చాలా సార్లు బెంగాల్ ప్రజానీకం మీద తమ కుటిలత్వం ప్రదర్శిస్తూ వచ్చారు. 

తమ ప్రాంతాన్ని పాకిస్థాన్ పాలకులు నిర్లక్ష్యం చేయడంతో  విసిగిపోయిన ఆ ప్రాంత ప్రజలు పాకిస్థాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలనే ఆకాంక్షించారు  బంగ్లాదేశ్ అని పేరును సైతం ఖరారు చేశారు. ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగానే అక్కడి రాజకీయ నాయకులు సైతం ఒక్క తాటిపైకి వచ్చి స్వతంత్ర దేశం కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు, రానురాను ఉధృతం కావడంతో భయపడిన పాలకులు ఉద్యమాన్ని అణిచివేయడమే లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం కు అజ్ఞాలు జారీచేసింది. 1971 మార్చి 25 రాత్రి నుండి తన క్రూరమైన అణిచివేత ను తూర్పు పాకిస్థాన్ లో ప్రారంభించింది. ఏప్రిల్ సైన్యం ఊచకోత తారాస్థాయికి చేరుకుంది. బెంగాల్ సంస్కృతి ని పాకిస్థాన్ చరిత్రలో లేకుండా చేయడమే లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం సృష్టించిన నరమేధంలో చిన్న, పెద్ద తేడాలేకుండా కొన్ని వేలమంది అమాయక ప్రజలు భలయ్యారు. 

తూర్పు పాకిస్థాన్ లో జరుగుతున్న నరమేధాన్ని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశ ప్రజలు లక్షల సంఖ్యలో భారతదేశంలో కి వలసలు కట్టారు.
ఈ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చిన భారతదేశ ప్రభుత్వం అక్కడి నాయకుల అభ్యర్థన మేరకు  తూర్పు పాకిస్థాన్ కు  మద్దతు గా యుద్ధంలో కి ప్రవేశించ బోతుంది అని పసిగట్టిన పాకిస్థాన్ గూఢచర్యం డిసెంబర్3,1971 న సాయంత్రం పాకిస్థాన్ వైమానిక దళం 6 వాయువ్య భారతీయ వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించింది. అప్పటికే సిద్ధంగా ఉన్న భారత వైమానిక దళం  పాకిస్థాన్ లోకి ప్రవేశించి పాకిస్థాన్ వైమానిక స్థావరాలని ముట్టడించాయి, దాదాపు అన్ని పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై ఆధిపత్యం సాధించిన భారత వైమానిక దళం , డిసెంబర్ 4 వ తేదీన పాకిస్థాన్ అతిపెద్ద వైమానిక స్థావరాల్లో ఒకటైన  కరాచీ ని సైతం స్వాధీనం చేసుకొంది.

పాకిస్థాన్ నౌక దళం యుద్ధం ఆరంభంలో ఏంతో బలంగా ఉన్న , భారత నౌక దళం యొక్క శక్తి ముందు నిలువలేక డిసెంబర్ 7 వ తేదీ నాటికి లొంగిపోయింది. భారత ఆర్మీ సైతం పాకిస్థాన్ సైన్యం మీద వీరోచితంగా పోరాడి భారత దేశానికి దాయాది దేశం మీద మరో యుద్ధ  విజయం సాధించింది. 

డిసెంబర్ 16 వరకు జరిగిన యుద్ధం తరువాత పాకిస్థాన్ సైన్యం చేసిన  అకృత్యాలు బయటపడ్డాయి. తూర్పు పాకిస్థాన్ గణాంకాల ప్రకారం 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, 5 లక్షల మంది మహిళలు (వయస్సు తో సంబంధం లేకుండా) అత్యాచారం చేయబడ్డారు. 50 లక్షల మంది శరణార్ధులుగా భారతదేశానికి వచ్చారు. 

పాకిస్థాన్ త్రివిధ దళాలాలు యుద్ధంలో ఓటమి పాలైన తరువాత 16 డిసెంబర్ 1971 న పాకిస్థాన్ దళాలకు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ నేతృత్వంలో 93000 దళాలు,  భారత సైన్య లెఫ్టినెంట్ జనరల్ జె.ఎస్ .అరోరా నేతృత్వంలో ఉన్న భారత సైన్యం మరియు ముక్తి బహినిలకు ఢాకా లో భేషరుతుగా లొంగిపోయారు.
దేశ ప్రధాని ఇందిరా గాంధీ గారు మానవత దృక్పథంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యుద్ధంలో పట్టుబడిన పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను విడుదల చేయడం జరిగింది. పాకిస్థాన్ యుద్ధం ముగిసిన తరువాత పాకిస్థాన్ నుండి  తూర్పు పాకిస్థాన్ ప్రాంతం విడిపోయి నూతన బంగ్లాదేశ్  దేశంగా అవతరించింది. 

బంగ్లాదేశ్ విముక్తి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్ధంలో పోరాడి అమరులైన వీరుల త్యాగాలకు ప్రతీకగా  డిసెంబర్ 16 ను భారత  , బంగ్లాదేశ్ లలో విజయ్ దివాస్ గా జరుపుకుంటున్నారు. 


ReplyForward







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: