సెప్టెంబర్ 13: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
చరిత్రలో ఈ నాడు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..
335 వ సంవత్సరంలో చర్చి ఆఫ్ హోలీ సెపల్చర్ జెరూసలేంలో పవిత్రం చేయబడింది.
533 వ సంవత్సరంలో బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క జనరల్ బెలిసరియస్ ఉత్తర ఆఫ్రికాలోని కార్తేజ్ సమీపంలో యాడ్ డెసిమియం యుద్ధంలో గెలిమర్ ఇంకా వాండల్స్‌ని ఓడించాడు.
604 వ సంవత్సరంలో సబీనియన్ పోప్ గ్రెగొరీ ది గ్రేట్ స్థానంలో పోప్‌గా తన పాలన ప్రారంభించాడు.
1125 వ సంవత్సరంలో సప్లిన్బర్గ్ డ్యూక్ లోథారియస్ జర్మన్ రాజు లోథారియస్ III గా పట్టాభిషేకం చేశారు.
1948 వ సంవత్సరంలో హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపడం జరిగింది.
చరిత్రలో ఈ నాడు జరిగిన జాననాల విషయానికి వస్తే...
1910 వ సంవత్సరంలో వేపా కృష్ణమూర్తి జన్మించడం జరిగింది. ఈయన ఒక తెలుగు ఇంజనీరు.
1913 వ సంవత్సరంలో సి.హెచ్. నారాయణరావు జన్మించడం జరిగింది. ఈయన తెలుగు సినిమా నటుడు.
1926 వ సంవత్సరంలో జి.వరలక్ష్మి జన్మించడం జరిగింది. ఈమె తెలుగు సినిమా నటి.
1940 వ సంవత్సరంలో సజ్జా జయదేవ్ బాబు జన్మించడం జరిగింది. ఈయనో కార్టూనిస్టు.
1946 వ సంవత్సరంలో రామస్వామి పరమేశ్వరన్ జన్మించారు. ఈయన భారత సైనిక దళంనకు చెందిన సైనికాధికారి.
1960 వ సంవత్సరంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జన్మించడం జరిగింది. ఈయన 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
1966 వ సంవత్సరంలో శ్రీ జన్మించడం జరిగింది. ఈయన సంగీత దర్శకుడు ఇంకా గాయకుడు.
ఇక చరిత్రలో ఈ నాడు జరిగిన మరణాల విషయానికి వస్తే..
1929 వ సంవత్సరంలో జతీంద్ర నాథ్ దాస్ మరణించడం జరిగింది. ఈయన స్వతంత్ర సమరయోధుడు ఇంకా అలాగే విప్లవవీరుడు.
1989 వ సంవత్సరంలో ఆచార్య ఆత్రేయ మరణించడం జరిగింది. ఈయన తెలుగులో నాటక ఇంకా సినీ రచయిత.
1966 వ సంవత్సరంలో దేవరాజు వేంకటకృష్ణారావు మరణించడం జరిగింది. ఈయన పత్రికా సంపాదకుడు, రచయిత ఇంకా ప్రచురణకర్త.
2012 వ సంవత్సరంలో రంగనాథ్ మిశ్రా మరణించడం జరిగింది. ఈయన 21వ భారత ప్రధాన న్యాయమూర్తి.
ఇక చరిత్రలో ఈ రోజుని అంతర్జాతీయ చాకోలెట్ దినోత్సవంగా జరుపుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: