పొగ బండిలో కూడా బ్రిటిష్ పొగ‌రే !

VAMSI

భారతదేశాన్ని బ్రిటీష్ దొరలు 200 సంవత్సరాల వరకు పరిపాలించారు. ఈ పరిపాలనా కాలంలో భారతీయులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఎన్నో కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చి మనల్ని రహసి రంపాలు పెట్టారు. కనీసం ఈ ఇంగ్లీష్ దొరలు మనుషులుగా కూడా గుర్తించలేదంటే ఎంత హీనమైన దుస్థితో ఒకసారి ఆలోచించండి. వ్యాపారం కోసమని భారత గడ్డపై అడుగు పెట్టి భారతీయుల మధ్యనే వివాదాలు సృష్టించి రాజులుగా మనల్ని ఏలారు. ఇందులో వారికి భయపడి సహకరించిన భారతీయులున్నారు. అలాగే స్వార్ధం కోసం సహకరించివారున్నారు. 1843 వ సంవత్సరంలో జనరల్ చార్లెస్ హార్డింగ్ గవర్నర్ గా ఉన్న సమయంలో వీరి వ్యాపార ప్రయోజనార్ధం, సైనికులు మరియు ప్రభుత్వ అవసరాలకు రైల్వే రహదారులు ఉంటే బాగుంటుందని ఆలోచించి మన దేశం వారు చెల్లించిన పన్నుల సహాయంతోనే రైలు మార్గాన్ని నిర్మించారు.
ఈ రవాణా మార్గం సహాయంతో భారతదేశంలో ఉన్నా సహజ వనరులయిన బొగ్గు, ఇనుము, పట్టి మొదలైన వాటిని బ్రిటీష్ వారి ఇళ్లకు అలాగే కర్మాగారాలకు దోచుకెళ్లారు. అయితే ఇలా దేశాన్ని అడ్డగోలుగా దోచుకువెళ్లారు. ఇది ఇలా ఉంటే రైళ్లలో మన భారతీయులను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేయడానికి వీలు లేదని నిషేధించారు. ఒకవేళ నిర్మించింది బ్రిటీష్ ఇంజనీర్ లే అయినప్పటినుకీ వారికి కట్టడంలో సహాయపడిన వారిలో మన భారతీయులు కూడా ఉన్నారు కదా. కాగా ఎంతో మంది ఈ రైలు రోడ్డు నిర్మాణ సమయంలో మరణించారు. అలాంటప్పుడు మనల్ని రైలులో ఈ బోగీలో ఎక్కకూడదు అని నియమాలు పెట్టడం ఎంతవరకు సబబు.
కానీ వీరు దారుణంగా ప్రవర్తించారు. రైల్ లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో "ఇక్కడ కుక్కలు మరియు భారతీయులు" ఎక్కడానికి కుదరదు అని నోట్ రాసి పెట్టడం వారి అణచివేతకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఆ తరువాత ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఎందరో మహనీయులు బ్రిటీష్ దొరలను మన దేశం నుండి వెళ్లగొట్టి మనకు స్వేచ్ఛను తీసుకొచ్చారు. వారి ప్రాణత్యాగమే ఈ రోజు మనము ఇంత సంతోషంగా బ్రతకగలుగుతున్నాము.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: