ఆగష్టు 10: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే..

0610 వ సంవత్సరంలో ఇస్లాం మతంలో సాంప్రదాయంగా ఇంకా అతి పవిత్రమైన లయలత్ అల్ ఖదర్ రోజున, ముహమ్మద్ ప్రవక్త, అతి పవిత్రమైన ఖురాన్ని అందుకోవడం జరిగింది.

1519 వ సంవత్సరంలో ఫెర్డినాండ్ మాగెల్లాన్, ఐదు నౌకలతో మొత్తం ప్రపంచాన్ని చుట్టిరావడానికి, సెవిల్లె నుండి బయలు దేరడం జరిగింది.

1680 వ సంవత్సరంలో మెక్సికోలో పెబ్లో (ప్యూబ్లో) ఇండియన్స్, స్పెయిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది.

1743 వ సంవత్సరంలో బహుమతి కోసం యుద్ధం చేయటం గురించిన నియమాలు (పోరాట నియమాలు) ఏర్పరిచినట్లుగా, మొట్టమొదటిగా రికార్డు చేయడం జరిగింది.

1792 వ సంవత్సరంలో లూయిస్ XVI రాజభవంతి పై ఫ్రెంచ్ ప్రజలు దాడి చేయడం జరిగింది.

1821 వ సంవత్సరంలో అమెరికా 24వ రాష్ట్రంగా మిస్సోరిని అమెరిక సెనేట్ అమోదించడం జరిగింది.

1833 వ సంవత్సరంలో చికాగో 200 మంది జనం గల ఒక గ్రామంగా అవతరించడం జరిగింది.

1840 వ సంవత్సరంలో కెనడాలో ఎగిరిన మొదటి బెలూన్ (గాలి గుమ్మటం) పేరు స్టార్ ఆఫ్ ది ఈస్ట్.

1846 వ సంవత్సరంలో స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ను అమెరికాలో స్థాపించడం జరిగింది.

1866 వ సంవత్సరంలో ట్రాన్సాట్లాంటిక్ కేబుల్ ని, అట్లాంటిక్ మహాసముద్రంలో వేయడం జరిగింది. ఇక దీనివలన ఖండాంతర దేశాలకు టెలిఫోన్ సౌకర్యం అనేది కలిగింది.

1877 వ సంవత్సరంలో రైలు ప్రయాణాన్ని, మొదటిసారిగా, టెలిఫోన్ వాడుతూ (నియంత్రిస్తూ) పంపించడం జరిగింది.అది సిడ్నీ మైన్స్ రైల్వే దగ్గర ఉన్న, గ్లేస్ బేలో ఉన్నటువంటి, కాలెడోనియా మైన్ (గని) వద్ద ఈ సంఘటన అనేది జరిగింది.ఇక ఈ గని యజమానులలో, ఒకడైన, అలెగ్జాండర్ గ్రాహంబెల్ మామగారైన, గార్డినెర్ జి. హబ్బర్డ్, రెండు టెలిఫోన్లు పెట్టి, వాటి ద్వారా రైలు ప్రయాణాన్ని నియంత్రించడం జరిగింది.

1945 వ సంవత్సరంలో జపాన్ చక్రవర్తి హిరోహితో హోదా లేదా యధాతధంగా ఉంచితే, జపాన్, మిత్రరాజ్యాలకు లొంగిపోవటానికి, తన సుముఖతను, ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: