అప్పటి ఎదులపురమే.. ఇప్పటి హుజురాబాద్..!

MOHAN BABU
హుజురాబాద్  ఒకప్పుడు ఈ పేరు అంటే ఎక్కువ మందికి తెలియదు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో  హుజురాబాద్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయం అంతా ఆ నియోజకవర్గం చుట్టే తిరుగుతుంది అని చెప్పవచ్చు. అంతటి ఘనత ఉన్న హుజురాబాద్ ఒకప్పుడు ఏవిధంగా ఉండేదో తెలుసుకుందాం. హుజురాబాద్ పట్టణానికి రెండువేల ఏండ్ల నాటి ఘన చరిత్ర ఉందని  పురావస్తు శాఖ చరిత్ర పరిశోధకులు రత్నాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ఆయన హుజురాబాద్ నియోజకవర్గం పై పరిశోధన చేసి  చరిత్ర గురించి వెల్లడించారు. హుజురాబాద్ ను ఒకప్పుడు రంగనాయకుల గుట్ట కింది భాగంలో ఎదులాపురం గ్రామాన్ని ముందుగా గుర్తించినట్లు తెలిపారు. ఇక్కడ  ఎక్కువగా తారసపడే రోళ్లకు, డిఫరెంట్ గా ఉన్న  వెడల్పాటి రోళ్లను, మరియు ఏమైనా దంచి నురడానికి బదులుగా ఉపయోగించినటువంటి రోకలిబండలను, అలంకరణలో  ఉపయోగించేటటువంటి ఇనుము, మట్టి పూసలు, ఉక్కు పరిశ్రమ, పెద్ద ఇటుకలు, విగ్రహాలు, కుండలు, భైరవ శిల్పం, నాగ దేవతలు ఇలా మరెన్నో ఆధారాలను ఆయన గుర్తించి వాటి గురించి వివరించారు.
 హుజురాబాద్ శివారు ప్రాంతంలోని  రంగనాయకుల పర్వతం పరిసర ప్రాంతాలలో  నవీన శిలా యుగం నుండి ప్రారంభమై శాతవాహనుల ఏలిన తర్వాత ఉన్నటువంటి అనేక చారిత్రక ఆధారాలను ఆయన బయట పెట్టేసారు. పూర్వం ఎదులాపురం గ్రామం రంగనాయకుల గుట్ట చుట్టూ ఉండేదని, 80 ఎకరాల పాటిమీద అని పిలుచుకునే ఎత్తైన మట్టి దిబ్బ అక్కడ ఉండేదని,  ఇంత విశాలంగా ఉండేటువంటి పాటిగడ్డలు చాలా అరుదుగా కనిపిస్తాయని, ఆయన అన్నారు. ఒకప్పుడు ఈ యొక్క ప్రదేశంలో అన్ని కులాల వారు  కలిసి జీవించిన ఆ పెద్ద గ్రామంగా చెప్పుకోవచ్చని ఈ ఆనావాళ్ళని చూస్తే అర్థం అవుతుంది అన్నారు. పాటిమీద పెద్దపెద్ద ఇటుకలతో నిర్మాణాలు చేశారని, గుణ పెంకులు కూడా ఉపయోగించారని, అలాగే తేలికైన ఇటుకలు కూడా దర్శనమిస్తున్నాయని, హనుమాన్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి పొలంలో  ఒక వీరుడు విగ్రహం ఉందని కాకతీయుల పాలన కాలంలో  ఆ వీరుని ఆరాధించేవారని, ఇలా అనేక ఆనవాళ్ళు ఇక్కడ దర్శనమిస్తాయని  అన్నారు. పురావస్తుశాఖ ఈ స్థలంలో తవ్వకాలు జరిపినట్లు అయితే అనేక చారిత్రక విషయాలు బయటపడే అవకాశం ఉన్నదని  ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: