జులై 4: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు...

Purushottham Vinay
చరిత్రలో ఈరోజు అనగా జులై 4 న జరిగిన సంఘటనలు చూసినట్లయితే..1892 వ సంవత్సరంలో వెస్ట్ సమోవా ఇంటర్నేషనల్ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకే 1892 సంవత్సరంలో 367 రోజులు  ఇక జూలై 4 తేది సోమవారం రెండుసార్లు వెస్ట్ సమోవా దేశంలో వచ్చింది.1946 వ సంవత్సరంలో ఫిలిప్పైన్స్ కు అమెరికా నుండి స్వతంత్రం వచ్చింది.ఇక 1947 వ సంవత్సరంలో భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన జరిగింది.1976 వ సంవత్సరంలో పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానాన్ని ఉగాండాలోని ఎంటెబ్బె విమానాశ్రయంలో బంధించారు. అప్పుడు ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడిచేసి ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (కాని నలుగురు ప్రయాణీకులు మరణించారు) విమాన సిబ్బందిని కాపాడారు.ఇక ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టడం జరిగింది.


ఇక 1902 వ సంవత్సరంలో ఫరెవర్ యూత్ ఐకాన్ భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద చనిపోయారు.ఇక 1934 వ సమావత్సరంలో ప్రముఖ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త అలాగే రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న మేరీ క్యూరీ మరణించడం జరిగింది.1936 వ సంవత్సరంలో 19 గ్రంథాలు రచించిన రాయకవి, తెలుగు కవి, తాడూరి లక్ష్మీనరసింహ మరణించారు.1946వ సంవత్సరంలో దొడ్డి కొమరయ్య మరణించారు. ఈయన తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు ఇంకా తొలి అమరుడు.1963వ సంవత్సరంలో  మన భారతదేశ జాతీయ పతాక నిర్మాత అయిన పింగళి వెంకయ్య చనిపోయారు.1969 వ సంవత్సరంలో కవికొండల వెంకటరావు మరణించారు.ఈయన ఒక మంచి తెలుగు కవి అంతేగాక మంచి జానపద, నాటక రచయిత.1986 వ సంవత్సరంలో దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ మరణించారు. ఈయన మంచి పేరొందిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.ఇక 2013 వ సంవత్సరంలో గంటి ప్రసాదం మరణించారు. ఈయన ఒక నక్సలైటు నాయకుడుగా మారిన కవి కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: