మే 20వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 20 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రముఖుల జననాలు:
1894 - చంద్రశేఖరేంద్ర సరస్వతి, భారతీయ గురువు పండితుడు (మ. 1994)
1896: అబ్బూరి రామకృష్ణారావు, తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త (మ.1979).
1900 - సుమిత్రానందన్ పంత్, భారతీయ కవి, రచయిత (మ. 1977)
1913: విలియం హ్యూలెట్, హ్యూలెట్ పాకార్డ్ కంపెనీ సహ-స్థాపకుడు (మ.2001).
1933: జె. వి. రమణమూర్తి, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు (మ.2016).
1939 - బాలు మహేంద్ర, శ్రీలంక-భారతీయ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ రైటర్ (మ .2014)
1944: దూడం నాంపల్లి, తెలుగు కవి (మ.2013).
1955: సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీ గీతరచయిత.
1978: పి.టి.ఉష, భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి.
1983: జూనియర్ ఎన్.టి.ఆర్, తెలుగు సినిమా నటుడు.
1984: మంచు మనోజ్ కుమార్, తెలుగు సినిమా నటుడు
ప్రముఖల మరణాలు:
1506: క్రిష్టొఫర్ కొలంబస్, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్తి. (జ.1451).
1932: బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు (జ.1858).
1957: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి (జ.1872).
1989: జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త (జ.1904).
1994: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1909)
1998: ఫ్రాంక్ సినట్రా, హాలీవుడ్ నటుడు (జ.1915).
సంఘటనలు
1498: పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కో డా గామా భారతదేశంలోని కోజికోడ్ (గతంలో కాలికట్ అని పిలుస్తారు) చేరుకున్నప్పుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.
1645: యాంగ్జౌ ఊచకోత: మింగ్ నుండి క్వింగ్ కు పరివర్తనలో భాగమైన యాంగ్జౌ నగరంలో 800,000 మంది నివాసితుల పది రోజుల ఊచకోత.
1883: క్రాకటోవా విస్ఫోటనం ప్రారంభమైంది;  మూడు నెలల తరువాత అగ్నిపర్వతం పేలి 36,000 మందికి పైగా మరణించారు.
1940: హోలోకాస్ట్: మొదటి ఖైదీలు ఆష్విట్జ్ వద్ద కొత్త నిర్బంధ శిబిరానికి వచ్చారు.
2006: గ్వాంటనామా బే నిర్బంధ శిబిరం వద్ద అల్లర్లు జరిగాయి.
2007: డేవిడ్ హిక్స్ను గ్వాంటనామా బే నుంచి ఆస్ట్రేలియా జైలుకి బదిలీ చేసారు.
2008: తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
2009: ఇండోనేషియాలో విమానం కూలి 100 మంది మరణించారు.
2010: యు ట్యూబ్, ఫేస్ బుక్ లను పాకిస్తాన్ నిషేధించింది.
2011: మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ.
2012: గుంటూరు జిల్లాలోని, రెంటచింతలలో 47 డిగ్రీల సెంటిగ్రేడ్ (116.6 డిగ్రీల ఫారెన్ హీట్ ) వేడి.
జాతీయ దినాలు:
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం
ప్రపంచ తేనెటీగ దినోత్సవం
తెలుగు కార్టునిస్టుల దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: