డిసెంబ‌ర్ 5వ తేదీకి చరిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో
డిసెంబ‌ర్ 5వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు
1970: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ.
1972: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.
ప్ర‌ముఖుల జననాలు
1782: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862).
1886: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు (మ.1969).అర్దెషీర్ ఇరానీ పర్షియన్-జొరాష్ట్రియన్కుటుంబాని చెందినవాడు. ఇతని పేరు ఖాన్ బహాదుర్ అర్దెషీర్ ఇరానీ, పూణెలో జన్మించాడు. భారతీయ సినిమా రంగంలో మొదటి టాకీ చిత్రమైన ఆలం ఆరాను ఇతనే నిర్మించాడు. 
1896: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969).
1901: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966).
1905: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982)
1940: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు.
1931: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (మ.2015)
1958: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
ప్ర‌ముఖుల మరణాలు
1950: శ్రీ అరబిందో, గురు (జ.1872).
1995: కాశీనాయన, పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు
2008: కొమ్మినేని శేషగిరిరావు, సినిమా నటుడు (జ.1939).
2008: మహ్మద్ ఇస్మాయిల్, సాహితీకారుడు (జ.1943).
2013: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918).
2016: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, సినిమానటి (జ.1948).

పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: