సెప్టెంబర్ 25వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?
జననాలు
1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)సతీష్ ధావన్ (1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3) భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. శ్రీనగర్లో జన్మించిన ధావన్, భారత్ లోను, అమెరికా లోనూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాడు. టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఈ రంగాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు భారత స్వదేశీ అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి దోహదపడింది. 1972 లో ఎమ్.జి.కె. మీనన్ తరువాత, ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
1924:ఎ.బి.బర్థన్, భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)అర్ధేందు భూషణ్ బర్ధన్ (25 సెప్టెంబరు 1924 – 2 జనవరి 2016)[1] లేదా ఎ.బి.బర్థన్, భారత దేశంలోని ప్రాచీన రాజకీయపార్టీ అయిన భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ గా పనిచేసారు. సంక్షుభిత సంకీర్ణ రాజకీయాల శకంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సమర్థవంతంగా నడిపించారు.
1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
1948: భూపతిరాజు సోమరాజు, పేరొందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్.
1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి
మరణాలు
1955: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864)
1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)
1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోకసభ సభ్యుడు. (జ.1901)
2005: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (జ.1927)
2019: వేణుమాధవ్ తెలుగు సినిమా హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు (జ.1969)