చరిత్రలో ఈరోజు : 06-08-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen
ఆగస్టు 6వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి.  మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో  తెలుసుకుందాం రండి.

 కొత్త రఘురామయ్య జననం : రక్షణ పెట్రోలియం పౌరసరఫరాలు మరియు లోక్ సభ వ్యవహారాల శాఖకు కేంద్ర మంత్రిగా పనిచేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు కొత్త రఘురామయ్య 1912 ఆగస్టు 6వ తేదీన జన్మించారు. మద్రాస్ హైకోర్టులో వకీలు గా పనిచేసిన ఈయన.. 1949లో ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. లోక్ సభ కు వరుసగా ఒకటి నుండి ఆరు  లోక్ సభ లకు  కూడా ఎన్నికయ్యారు. ఇక కేంద్రంలో కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగిన కొత్త రఘురామయ్య... కేంద్రంలో రక్షణ పెట్రోలియం పౌరసరఫరాలు మరియు లోక్ సభ వ్యవహారాల శాఖకు కేంద్ర మంత్రి గా సేవలు అందించారు.

 గడ్డవరపు పుల్లమాంబ జననం  : ప్రముఖ రచయిత్రి స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు అయిన గడ్డవరపు పుల్లమాంబ  1931 ఆగస్టు 6వ తేదీన జన్మించారు. మల్లంపల్లి శరభయ్య శిష్యరికంలో సంస్కృతం నేర్చుకుని ఆ తర్వాత ప్రముఖ రచనలు రచించారు ఈమె. పుల్లమాంబ  రచించిన ఎన్నో రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి . తన రచనలకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు పుల్లమాంబ .

 ప్రొఫెసర్ జయశంకర్ జననం : తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ పితామహుడు, తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసి.. ఉద్యమ సారధి కేసీఆర్ ను ముందుండి నడిపించిన వ్యక్తి  జయశంకర్ 1934 ఆగస్టు 6వ తేదీన జన్మించారు. తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖర్రావుకు సలహాదారుగా మార్గదర్శిగా కూడా మెలిగారు ప్రొఫెసర్ జయశంకర్.

 కే శివారెడ్డి జననం : సుప్రసిద్ధ వచన కవి,  విప్లవ కవి అయిన  కె.శివారెడ్డి 1943 ఆగస్టు 6వ తేదీన జన్మించారు. ఇక తన విప్లవ కవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించాడు శివారెడ్డి. ఈయన కవితలు అన్ని సుదీర్ఘంగా ఉంటాయి. సామాజిక అంశాలన్నీ పదేపదే ఆలోచించి కవితాబద్ధం చేస్తాడు  శివారెడ్డి. ఇక ఈయన  రచించిన రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి అని చెప్పాలి. దీంతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

 సురేంద్రనాథ్ బెనర్జీ మరణం : భారత జాతీయోద్యమ నాయకుడు అయిన సురేంద్రనాథ్ బెనర్జీ 1925 ఆగస్టు ఆరో తేదీన పరమపదించారు. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత రాజకీయ నాయకులలో ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ. ఇండియన్ నేషనల్ అసోసియేషన్ స్థాపించి ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ కు రెండుసార్లు నాయకత్వం వహించారు.

 సుష్మాస్వరాజ్ మరణం : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు మాజీ కేంద్రమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ 2019 ఆగస్ట్ 6 వ తేదీన పరమపదించారు. 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేసి విద్యార్థి సంఘం నాయకురాలు గా ఉంటూ... ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ఆ  తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు సుష్మా  స్వరాజ్. ఆ తర్వాత 1996- 98 లో వాజపేయి మంత్రివర్గంలో కూడా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: