చరిత్రలో ఈరోజు : 14-04-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen

ఏప్రిల్ 14వ తేదీన ఒకసారి చరిత్రలోకి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరొక్కసారి చరిత్రలోకి వెళితే ఈరోజు జరిగిన సంఘటనలు  ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 టైటానిక్ ప్రమాదం  : 1912 ఏప్రిల్ 14వ తేదీన టైటానిక్ ఓడ మునిగిపోయింది. అయితే అతి పెద్దదైన టైటానిక్ ఓడ మునిగిపోవడం తో సంచలనంగా మారింది . ఇక ఈ ఘటన ఆధారంగా ఏకంగా హాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా వచ్చింది. 

 

 ఆయుష్మాన్ భారత్ పథకం : 2018 ఏప్రిల్ 14వ తేదీన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018-19 సంవత్సరం జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

 

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జననం  : రాజ్యాంగ నిర్మాత.. భారత ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తి... భారత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి.. అయిన  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రస్తుతం మనుషులు ఎలా ఉండాలి ఎలా మెలగాలి... తప్పు చేస్తే ఇలాంటి శిక్ష పడుతుంది అనే దాన్ని ప్రస్తుతం భారత ప్రజలు అందరూ ఫాలో అవుతున్నారు . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారమే ప్రస్తుతం భారత దేశం మొత్తం ముందుకు సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాలలో  కొన్ని ముఖ్యాంశాలను సేకరించి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. 

 

 గొల్లపూడి మారుతి రావు జననం : రచయిత నటుడు సంపాదకుడు వ్యాఖ్యాత విలేకరి తెలుగు సాహిత్య అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి ఆయన గొల్లపూడి మారుతి రావు 1939 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. మొదట స్క్రిప్ట్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమైన గొల్లపూడి మారుతీరావు... తర్వాత నటుడిగా... ప్రతినాయకుడిగా హాస్యనటునిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఎన్నో  విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి మరి నటించి ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు గొల్లపూడి మారుతి రావు. 

 

 బాబు గోగినేని జననం  : హైదరాబాద్ కు  చెందిన ఈ ప్రముఖ హేతువాది మానవతా వాది అయిన బాబు గోగినేని 1968 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అప్పటివరకు టీవీ షోలలో పలు డిబేట్ లలో  కనిపించిన బాబు గోగినేని మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుని తెలుగు ప్రజలందరికీ సుప్రసిద్ధ గా మారిపోయాడు. బిగ్ బాస్ షోలో తన భావాలను వ్యక్త పరుస్తూ ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు బాబు గోగినేని . బిగ్ బాస్ షో ద్వారా ఎంతగానో గుర్తింపు కూడా సంపాదించారు. 

 

 కొమరవోలు శ్రీనివాస రావు జననం : రంగస్థల టీవీ రేడియో నాటకాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న  శ్రీనివాస రావు  1953 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. గుంటూరు జిల్లాలో జన్మించిన ఈయన రంగస్థల నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎన్నో సాంఘిక చారిత్రాత్మక పౌరాణిక నాటకాల్లో  నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు కొమరోలు శ్రీనివాస రావు. 

 

  గుబ్బురు వెంకటనందు  రాఘవరావు జననం : తొలి తెలుగు ఖగోళ  శాస్త్ర గ్రంథం రచయిత అయిన గొబ్బూరి వెంకట్ ఆనంద రాఘవరావు 192 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. ఎలమంచిలి లో స్థిరపడ్డ ఈయన ఖగోళ  శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి జీవితకాలం త్యాగం చేశారు.ఖగోళ శాస్త్రంలో పరిశోధనల ద్వారా శాస్త్ర విజ్ఞానంలో ఎన్నో అంశాలను ఆవిష్కరించారు వెంకటనంద  రాఘవరావు. ఖగోళ శాస్త్రం  లోని అంశాలను పౌరాణిక పాత్రలతో ముడిపెట్టి చెప్పిన ప్రాచీన శాస్త్రవేత్తలు పరిశోధనలు ఆదర్శంగా తీసుకున్నారు ఈయన. 

 

 రాహుల్ సాంకృత్యాయన్ మరణం : రచయిత చరిత్రకారుడు కమ్యూనిస్టు నాయకుడు అయినా రాహుల్ సాంకృత్యాయన్ 1963 ఏప్రిల్ 14వ తేదీన మరణించారు. 

 

 ఘంటా గోపాల్  రెడ్డి మరణం : వ్యవసాయ శాస్త్రవేత్త ఎత్తిపోతల పథకం రూపకర్త ఆయన గంట గోపాల్ రెడ్డి 2018 ఏప్రిల్ 14వ తేదీన మరణించారు. వ్యవసాయాభివృద్ధికి రైతులకు అవగాహన కల్పించడానికి ఎంతగానో కృషి చేశారు. 

 

 అగ్నిమాపక దళం దినం : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అగ్నిమాపక దళ దినం జరుపుకుంటారు. అగ్నిమాపక సిబ్బంది ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రాణాలకు తెగించి మరీ చేస్తున్న పోరాటానికి కొనియాడుతూ ఉంటారు  ప్రముఖులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: