చరిత్రలో ఈరోజు : ఫిబ్రవరి 2 వ తేదీన జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసా..?
ఒకసారి చరిత్రలోకి తొంగిచూస్తే ఫిబ్రవరి రెండవ తేదీన ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి హిస్టరీ లోకి తొంగి చూసి అసలు ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.
కానీబట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం : ప్రముఖ తెలుగు రచయిత అయిన కానీబట్ట బ్రహ్మయ్యశాస్త్రి 1963 ఫిబ్రవరి 2వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన సాహిత్యంలో ఎన్నో రచనలు రచించి... అందించారు.ఈయన వ్రాసిన రచనలు వ్యాసాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలు రాశారు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి.
మోటూరి సత్యనారాయణ జననం : దక్షిణ భారతదేశంలో హిందీ భాషను వ్యాప్తి చేసిన మహా పండితులైన వేటూరి సత్యనారాయణమూర్తి 1902 ఫిబ్రవరి 2 వ తేదీన జన్మించారు. ఈయన దక్షిణ భారతదేశంలో హిందీని వ్యాప్తి చేసిన మహాపండితుడు గానే కాకుండా స్వతంత్ర సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు.
తిమ్మ వజ్జల కోదండరామయ్య జననం : ప్రముఖ సాహిత్య పరిశోధకారుడైన తిమ్మ వజల్ల కోదండరామయ్య 1925 ఫిబ్రవరి 2వ తేదీన జన్మించారు. ఈయన 300కు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు పరిశోధన ప్రత్యేక సంపాదకత్వం రచించారు.
వెలమాటి రామదాసు జననం : వైద్యశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన వెలమాటి రామదాసు 1923 ఫిబ్రవరి 2 వ తేదీన జన్మించారు. వైద్య పరిశోధన చికిత్స రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. దేశ విదేశీ సైన్స్ జనరల్స్ లో అనేక పరిశోధన వ్యాసాలు రాశారు వెలమాటి రామదాసు. శ్వాసవ్యవస్థ వైద్యుల్లో అగ్రగణ్యుడు ఈవెలమాటి రామాదాసు . జూన్ 24 2006 సంవత్సరంలో పరమపదించారు.
ఎస్వీ రామారావు జననం : ప్రముఖ తెలుగు సినీ రచయిత ఎస్.వి.రామారావు 1942 ఫిబ్రవరి 2వ తేదీన జన్మించారు. ప్రముఖ రంగస్థల నటుడు. పాఠశాల నుండే ఎన్నో నాటకాలు రచిస్తూ ప్రదర్శించారు ఎస్.వి.రామారావు. ప్రముఖ పత్రికల కు సినిమా సమీక్షలు రాయడం సినిమాలపై విశ్లేషిస్తూ ప్రసంగించడం తో కూడిన సినీ విశ్లేషకుడుగా ఈయనకు ఎంతో పేరు వచ్చింది. పలు సినిమాలకు కథ రాయడం తో పాటు 15 సినిమాలలో నటించాడు కూడా. అలనాటి ప్రముఖ నటులతో కలిసి నటించారు ఎస్.వి.రామారావు. కాగా తెలుగు సినిమా పై 13 పుస్తకాలు రచించిన తెలుగు సినిమా చిత్రకారుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక ఈయన రచనలు నటనకు గాను ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు . తెలుగుతెరపై ఇప్పటికి ఎస్.వి.రామారావు గుర్తు చేసుకుంటారు.
జే భాగ్యలక్ష్మి జననం : ఇంగ్లీషు తెలుగు భాషలలో గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి జే భాగ్యలక్ష్మి 1943 ఫిబ్రవరి 2వ తేదీన జన్మించాడు.
కోపల్లె హనుమంతరావు మరణం : మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల ను స్థాపించారు కోపల్లె హనుమంతరావు. జాతీయ విద్య కై ఎంతగానో కృషి చేశారు. జాతీయ విద్యను నిత్యం అభివృద్ధి చేయడంలో కృషి చేసిన తెలుగు వాళ్ళలో సుప్రసిద్ధుడు కోపల్లె హనుమంతరావు. ఈయనా 1922 ఫిబ్రవరి రెండవ తేదీన మరణించారు.