రోజూ పరగడుపునే 1 లీటర్ నీటిని తాగితే..?

Edari Rama Krishna
ఉదయాన్నే పరగడుపున నీటిని తాగితే మంచిదని అందరికీ తెలిసిందే. దీంతో అనేక అనారోగ్యాలు నయమవుతాయని డాక్టర్లే కాదు, మన పెద్దలు కూడా చెబుతారు. అందుకే చాలా మంది ఉదయం లేవగానే ముందుగా నీళ్లను తాగుతారు. కనీసం లీటరు నీటినైనా తాగితే దాంతో కింద చెప్పిన విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ ఉదయాన్నే పరగడుపున నీటిని తాగితే శరీర మెటబాలిక్ రేటు 24 శాతం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయ్యే రేటు పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.

2. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.

3. జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం బాధించవు. ప్రధానంగా మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. విరేచనం సులభంగా అవుతుంది. ఆకలి పెరుగుతుంది.

4. తలనొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు. శరీర వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పెద్ద పేగు శుభ్రమవుతుంది. ఇన్‌ఫెక్షన్లు, అల్సర్లు రాకుండా ఉంటాయి.

5. శరీరానికి అందే శక్తి పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు పెరిగి ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. కనుక శరీరానికి ఎక్కువగా శక్తి అందుతుంది.

6. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.

7. జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. మంచి బాక్టీరియా పెరుగుతుంది.మి నవీన్ నడిమింటి అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీలను తగ్గించే చిట్కాలు అతిగా భోజనం , సమయ పాలన లేకుండా ఆహారం తినడం, జంక్ ఫుడ్‌, కొవ్వు అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల చాలా మందికి అజీర్తి సమస్య తలెత్తుంది.

దాని వెంటే గ్యాస్‌, అసిడిటీలు కూడా వస్తాయి. అయితే వీటిని తగ్గించుకోవాలంటే ఇంగ్లిష్ మందులు అవసరం లేదు. ఆయా సమస్యలకు ఇంట్లోనే చక్కని పరిష్కారం ఉంది. ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


1. అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారీ నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా, త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది.
2. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.
3. భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి. 2, 3 లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు.
4. జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి, దానికి కొంత తేనెను జతచేసి ఉదయాన్నే పరగడుపున తింటే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.
5. అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారీ వేసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ కూడా తగ్గుతుంది. ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది.
6. కొద్దిగా పెరుగును తీసుకుని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. క


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: