“వేసవి” లో...“రాగి జావ” ఎందుకు తాగాలో తెలుసా

Bhavannarayana Nch

మనకి ప్రక్రుతి ప్రసాదించిన అన్ని కాలాలలో కంటే కూడా వేసవి కాలం అంటే మనిషికి అత్యంత కష్టమైన కాలం..ఈ కాలంలో   ప్రతీ ఒక్కరు సూర్యుడి తాపానికి భయపడిపోతూ ఉంటారు..ప్రతీ సంవత్సరం ఈ వేసవి కాలలో వేడి గాలులు ఎక్కువగా ఉండటం ప్రజలు అనారోగ్యానికి  లోనవ్వడం..ఇలా ప్రతీ ఏడు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గటం అనేది జరగనే జరగదు. వేసవి కాలలో మనిషి శరీరం అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది..దాంతో ఎన్నో అనారోగ్యాలు..సరిగా తినకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు..అయితే ఈ సమస్యలని కంట్రోల్ చేసి శరీరాన్ని చల్లబరచడానికి రాగులు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి..


రాగులు ఎంతో బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది...ముఖ్యంగా ఎదుగుతూ ఉండే పిల్లలకి రాగులు ఎంతో బాగా ఉపయోగపడుతాయి..ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లైతే పిల్లలు బాగా ఎదుగుతారు...వేసవి కాలంలో  తరచూ వచ్చే కడుపు మంటకి ఇది దివ్యౌషధం అని పెద్దలు చెప్తూ వేసవిలో రాగి పదార్థాలను తీసుకోవడం ద్వారా కడుపులో మంటను తగ్గుతుంది. 

 

 శరీరానికి రాగులు చేసే చలువ మారేవి చేయలేవు..పైత్యాన్ని తగ్గిస్తుంది..వేసవిలో అధికంగా వచ్చే దాహార్తిని తగ్గించడంలో ముఖ్యంగా ఉపయోగ పడుతుంది....వృద్ధాప్యంలో వున్న వారు వేసవిలో రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి శక్తి చేకూరుతాయి...అంతేకాదు శరీరంలో ఎముకల దృఢంగా ఉండటానికి సైతం రాగులు ఉపయోగ పడుతాయి..

 

వేసవిలో చాలా మంది ఎకువగా సుగంధి పాలు తాగుతారు అయితే వీటిలో రాగి మాల్ట్ కలిపి తీసుకుంటే అధిక రక్త పోటుని తగ్గిస్తుంది..ఎందాకాలలో బీపీ ఉన్నవాళ్ళకి ఈ చిట్కా ఎంతో బాగా ఉపయోగ పడుతుంది..కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా ఉండటానికి సైతం ఇది ఉపయోగ పడుతుంది..ఈ పద్దతులు మన పూర్వీకులు ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్నారు కనుక ఎటుంటి అభ్యంతరాలు లేకుండా వీటిని సేవించవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: