Health: చిన్న పిలల్లో ప్లేట్లేట్స్ కౌంట్ పడిపోకుమండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

Thota Jaya Madhuri
వాతావరణం పూర్తిగా మారిపోయింది. పగలంతా ఎండ, సాయంత్రం చల్లటి గాలి, రాత్రి వర్షం – ఇలా మారిపోతున్న క్లైమేట్‌కి పిల్లలకు రకరకాల వైరల్‌ ఫీవర్లు వస్తున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి తర్వాత జ్వరం వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పిల్లలకు 10–15 రోజులు, ఇంకొంతమంది పిల్లలకు తినలేనంత కాలం వరకు జ్వరం కొనసాగుతోంది. కొన్ని ఫీవర్లు మరీ డేంజర్‌గా మారి డెంగ్యూ, టైఫాయిడ్‌ లాంటి వ్యాధులకు దారితీస్తున్నాయి. ఫీవర్‌ లేకపోయినా కొందరు పిల్లల్లో ప్లేట్లెట్‌ కౌంట్‌ అమాంతం పడిపోతుంది. అసలు పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్‌ కౌంట్‌ ఎందుకు పడిపోతుంది? అప్పుడు ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!


ప్లేట్లెట్ కౌంట్ అంటే ఏమిటి?

*ప్లేట్లెట్స్ రక్తంలోని చిన్న కణాలు, ఇవి రక్తం గడ్డకట్టడంలో  చాలా కీలకం.

*సాధారణంగా పిల్లల్లో ప్లేట్లెట్ కౌంట్ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండటం నార్మల్.

జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ ఎందుకు పడిపోతుంది?

*వైరస్ ఇన్ఫెక్షన్ల ప్రభావం : డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్స్‌లో వైరస్ నేరుగా ఎముక మజ్జ  మీద ప్రభావం చూపి ప్లేట్లెట్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్ : జ్వరం సమయంలో శరీరం ఇమ్యూనిటీ పెంచడానికి యాంటీబాడీలు తయారు చేస్తుంది. ఈ యాంటీబాడీలు ప్లేట్లెట్లను కూడా డిస్ట్రాయ్ చేయవచ్చు.

ప్లేట్లెట్ వినియోగం పెరగడం: ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్  పెరిగి ప్లేట్లెట్‌లు ఎక్కువగా ఉపయోగించబడతాయి.

డెహైడ్రేషన్ :జ్వరం సమయంలో నీరు తగ్గిపోతే రక్తం గడ్డకట్టే అవకాశం పెరుగుతుంది, ప్లేట్లెట్ లెవెల్ తక్కువగా కనిపించవచ్చు.

ప్రమాదకర స్థాయి:

*1 లక్ష కంటే తక్కువ అయితే జాగ్రత్త అవసరం.

*50,000 కంటే తక్కువ అయితే రక్తస్రావం వచ్చే ప్రమాదం ఉంటుంది.

*20,000 కంటే తక్కువ అయితే హాస్పిటల్‌లో అడ్మిషన్ తప్పనిసరి.

పిల్లల్లో ప్లేట్లెట్ కౌంట్ పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

*జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి

*ప్రత్యేకంగా డెంగ్యూ, మలేరియా వంటి ప్రాంతాల్లో ఉంటే నిర్లక్ష్యం చేయకండి.

*సరైన హైడ్రేషన్:నీరు, కొబ్బరి నీరు, సూప్‌లు, పండ్ల రసాలు, ఓఋశ్ ఇవ్వాలి.

పోషకాహారం: పపయా లీఫ్ జ్యూస్, కివి, దానిమ్మ, బొప్పాయి, సిట్రస్ ఫ్రూట్స్, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

ఓవర్-ది-కౌంటర్ మందులు వాడకండి:

*జ్వరం తగ్గించే మందులు ..డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే ఇవ్వండి. వైరల్ ఫీవర్స్‌లో రెగ్యులర్ బ్లడ్ టెస్ట్..24-48 గంటలకొకసారి ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేయండి.

*చాలా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఆపండి

డాక్టర్‌ని వెంటనే కలవాల్సిన లక్షణాలు:

*ముక్కు/పళ్ల మాంసం నుంచి రక్తం రావడం

*చర్మంపై ఎరుపు మచ్చలు

*అధికంగా వాంతులు, బలహీనత

*కడుపు నొప్పి లేదా శ్వాస ఇబ్బంది

*ప్లేట్లెట్ కౌంట్ 50,000 కంటే తక్కువగా రావడం


ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం అంటే ఎప్పుడూ డెంగ్యూ మాత్రమే కాదు. చాలా వైరల్ ఫీవర్స్‌లో ఇది నార్మల్ ప్రాసెస్. కానీ లెవెల్ తక్కువగా ఉంటే మాత్రం హాస్పిటల్ ట్రీట్మెంట్ చాలా అవసరం...!!

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం కొందరు డాక్టర్లు చెప్పిన విధంగా ఇవ్వబడ్డింది. ఏదైన సలహా పాటించే ముందు మీ డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం అని గుర్తు పెట్టుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: