రాత్రి ఈ ఒక్క పని చేస్తే నా సామీ రంగా..వద్దు అన్నసరే వెంటనే నిద్ర పట్టేస్తుంది..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో చిన్నవారైనా, పెద్దవారైనా అందరికీ సాధారణంగా ఎదురవుతున్న సమస్యల్లో ఒకటి నిద్ర పట్టకపోవడం. రాత్రి 11–12 గంటలు దాటినా నిద్ర రావడం లేదు అనేది చాలా మందికి అలవాటుగా మారిపోయింది. ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. సాయంత్రం చీకట్లు కమ్ముకున్నాక, ఏడు గంటలకల్లా అందరూ భోజనం చేసి పడుకునే వారు. ఆ కాలంలో ప్రజల ఆరోగ్యం బంగారం లాంటిది, పెద్ద పెద్ద రోగాలు ఎవరికీ ఎక్కువగా రావు. జీవనశైలి సాదాసీదాగా ఉండేది, అందుకే ఆరోగ్య సమస్యలు కూడా తక్కువగానే ఉండేవి.



కానీ కాలం మారింది. టెక్నాలజీ అభివృద్ధి చెంది, కొత్త అలవాట్లు పెరిగిపోయాయి. మొబైల్ ఫోన్లు, టెలివిజన్, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్లకు ఎక్కువ సమయం కేటాయించడం వలన నిద్రలేమి సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గిపోతోంది. దీన్ని గమనించిన డాక్టర్లు ఎన్నో సార్లు  “రాత్రి పడుకునే ముందు స్క్రీన్‌లను దూరంగా పెట్టండి, మంచి నిద్ర వస్తుంది” అని హెచ్చరించిన కొందరు వినడంలేదు. అయితే కొందరు మాత్రం, “మేము స్క్రీన్ చూడం, అయినా రాత్రిళ్లు నిద్ర రావడం లేదు” అని బాధపడుతున్నారు.

 

అలాంటి వారి కోసం డాక్టర్లు ఒక సింపుల్, సహజమైన టిప్ సూచిస్తున్నారు. “రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ గసగసాలు (పాపీ సీడ్స్) వేసి, అవి వేయించి పొడి చేసిన మిశ్రమాన్ని కలిపి తాగండి. ఈ పాలు తాగిన 10 నిమిషాలకే మంచి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది.” ఈ పద్ధతి అనేకమందికి ప్రయోజనకరంగా పనిచేసిందని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది పెద్దవాళ్లకు కూడా ఇదే సూచన ఇవ్వగా, మంచి ఫలితాలు వచ్చాయని వారు గుర్తుచేస్తున్నారు. అందువల్ల రాత్రిళ్లు స్క్రీన్ టైమ్ చూసినా, చూడకపోయినా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారు ఒకసారి ఈ సహజ పద్ధతిని ప్రయత్నించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.ప్రస్తుతం ఈ సింపుల్ టిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.




నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొంతమంది డాక్టర్లు చెప్పిన విధంగానే అందించబడింది. దీనిని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు పాటించాలి అనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత నిర్ణయం అనేది గుర్తుంచుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: