
బీరు తాగితే..షుగర్ వస్తుందా..?
ముఖ్యంగా కాలేయం, నిద్ర మరియు బరువు పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. అలాగే రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా పెంచుతుందని.. టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందట. షుగర్ పేషెంట్లు అప్పుడప్పుడు పానీయాలు తాగిన పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఆల్కహాల్ తాగారంటే మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మద్యం సేవించినప్పుడు మన శరీరం వాటిని విషయంగా గుర్తిస్తుందట.అందుకే శరీరం మద్యం సేవించినప్పుడు ఇతర కార్యకలాపాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని తెలుపుతున్నారు. ఈ ఆల్కహాల్ ప్రేగులలోకి ప్రవేశించి జీర్ణ క్రియను కూడా చెడగొడుతుందట.
కాక్టైల్స్ లేదా ఆల్కహాల్ వంటివి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయట మద్యం ఆరోగ్యానికి సురక్షితం కాదని కూడా WHO అధికారులు కూడా తెలియజేశారు. కాలేయ వ్యాధి , సిర్రోసిస్, గుండెకు సంబంధించిన జబ్బులు కూడా రావడానికి ఈ ఆల్కహాల్ ఒక ముఖ్య కారణమని ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఎవరికైనా డయాబెటిస్ ఉన్నట్లు అయితే బీరు తాగడం వల్ల హైపోగ్లసీమియా వంటివి వచ్చే అవకాశం ఉంటుందట ఇది బీరు రక్తంలో చక్కెర స్థాయిల పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుందట. ఇది ఎక్కువ కేలరీలు కలిగి ఉన్నందువల్ల బరువు పైన కూడా ప్రభావితం చేస్తుంది.
వారానికి 13 గ్లాసులకు మించి మద్యం సేవించేవారు గుండెపోటు ప్రమాదానికి గురవుతున్నారని వైద్యులు తెలుపుతున్నారు. ఇక మహిళలు ఇంతకుమించి ఎక్కువ మోతాదు తాగితే చాలా ప్రమాదాలు ఉంటాయని తెలుపుతున్నారు. ఆల్కహాల్ తాగిన వెంటనే చాలామంది తీపి పదార్థాలు తింటున్నారని వీటివల్ల షుగర్ కూడా పెరుగుతుందని తెలుపుతున్నారు.