నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే ఏం జరుగుతుంది.. ఈ విషయం తెలుసుకోండి?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో నాన్ వెజ్ అనేది ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో ముక్క లేనిదే ముద్ద దిగదు అనే మాట ప్రతి ఇంట్లోనూ వినిపిస్తుంది. కేవలం సంపన్నులు మాత్రమే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇలా నాన్ వెజ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడి పోతున్నారు. తమత తాహతకు తగ్గట్లుగానే చికెన్ లేదంటే మటన్ తెచ్చుకొని ఇక తినడం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా నాన్ వెజ్ ప్రియులు ఎక్కువైపోయారు అనడంలో సందేహం లేదు.

 అయితే ఏదైనా మితిమీరితే చివరికి ప్రమాదంగా మారిపోతూ ఉంటుంది. నాన్ వెజ్ విషయంలో కూడా ఈ రూల్ వర్తిస్తుంది అని నిపుణులు చెబుతూ ఉంటారు.  నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అంటూ నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అందుకే పరిమితంగా మాత్రమే నాన్ వెజ్ ను తీసుకోవడం ఎంతో మంచిది అని సూచిస్తూ ఉంటారు. అయితే బాగా నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవారు ఒక నెలరోజుల పాటు మాంసాహారం తినడం మానేస్తే ఏం జరుగుతుంది.

 వామ్మో నెల రోజులు మాంసాహారం తినకుండా ఉండడమా.. నా బాడీ తట్టుకోగలదా అని అందరూ అనుకుంటారు. కానీ ఇలా నెలరోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయట. ప్రతిరోజు నాన్ వెజ్ కావాలని ముక్క లేనిదే ముద్ద దిగదు అనుకునేవారు నెలరోజుల పాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నెలపాటు నాన్ వెజ్ మానేస్తే అజీర్ణం జీర్ణకోశ సమస్యలు కూడా తగ్గుతాయట. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. అధిక రక్తపోటు సమస్య తగ్గి ఎముకల బలం మెరుగవడమే కాదు అటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. అంతేకాకుండా ఆర్థరైటిస్ నొప్పులు వాపులు కూడా తగ్గుతాయని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: