వామ్మో: పచ్చిమాంసంతో జర జాగ్రత్త...లేదంటే అంతే సంగతులు..?

FARMANULLA SHAIK
ఈ రోజుల్లో ఫ్రిజ్‌లేని ఇళ్లు లేదు . కొంతమంది మహిళలలు ఏదైనా ఊరు వెళ్లేప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా.. వారం రోజులు సరిపడా కూరలు వండేసి ఫ్రిజ్‌లో పెట్టేసి వెళ్తారు. మరికొందరూ మిగిలిపోయిన ఆహారం ఫ్రిజ్‌లో పెట్టి కొన్నిరోజుల తర్వాత తింటారు. కొంత మంది బయటి నుంచి తెప్పించుకొనే ఆహారాన్ని కూడా ఫ్రిజ్ లో పెట్టుకుని మరీ తింటారు. మరి కొంత మంది అయితే వారాల తరబడి ఆహారం ఫ్రిజ్‌లో ఉంచుకుని తింటారు. సాధారణంగా కూరగాయలు, పండ్లు, మాంసం ఫ్రెష్‌గా ఉండటానికి ఫ్రిజ్‌లో పెడతాం.ఈ నేపథ్యంలో నేచాలా మందికి రోజూ మాంసాహారాన్ని తినే అలవాటు ఉంటుంది. ప్రతి రోజూ షాపుకెళ్లి తెచ్చుకునే ఓపిక లేక కొంతమంది అధిక మొత్తంలో తెచ్చి ఫ్రిజ్ లో దాచుకుంటారు. కొన్ని రోజులు, వారాల పాటూ కూడా దాచుకుంటారు.  అయితే మాంసాహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అనారోగ్యాన్ని కలుగచేస్తాయి. 

ఇదిలావుండగా పచ్చి మాంసాన్ని ఫ్రిజ్లో పెట్టి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రిజ్లో నిలువ ఉంచే మాంసంపైన ఈకొలి అనే బాక్టీరియా అధికంగా చేరుతుంది. మహిళలు ఫ్రిజ్లో నుంచి మాంసాన్ని బయటకు తీసినప్పుడు ఆ బాక్టీరియా వారి చేతుల పైకి చేరి తరువాత చేతుల నుంచి ముక్కు ,నోరు ద్వారా కడుపులోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఎవరైతే యూరినరీ ఇన్ఫెక్షన్ బారిన పడతారో వారిలో ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే మూత్రం విసర్జించేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే అధికంగా మంట ఉంటుంది.

సాధారణంగా కాకుండా, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లడం కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు సంకేతంగా చెబుతూ ఉంటారు.ముఖ్యంగా మహిళలకు పచ్చి మాంసాన్ని ఫ్రిజ్లో నిలువ చేస్తే తినడం ఏమాత్రం మంచిది కాదు. పచ్చి మాంసాన్ని ఫ్రిజ్లో నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. మాంసం షాప్ నుంచి తీసుకు వచ్చినప్పుడు కొంత వాటర్ లేదా బ్లడ్ లాంటిది ఉంటుంది. దానిని నేరుగా ఫ్రిజ్లో పెడితే అది ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: