మోకాళ్ల నొప్పులా..ఈ ఆహారాల జోలికి వెళ్ళకండి..?

Divya
ప్రస్తుతం ఉన్న కాలం లో వయసుకు సంబంధం లేకుండా చాలామందికి మోకాళ్ల నొప్పులు, చేతి కండరాలు ఇతర వంటివి చాలా మందికి వస్తూనే ఉన్నాయి. అయితే మనం తినే ఆహార పదార్థాల వల్ల కూడా మనకు తెలియకుండానే నొప్పులు వస్తున్నాయని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే అలాంటి ఆహార పదార్థాలను దూరంగా ఉండడం మంచిదట.మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ముఖ్యంగా ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నొప్పులు వస్తాయట. ముఖ్యంగా టేస్టింగ్ సాల్ట్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు.
చక్కెర ద్వారా తయారు చేసే పదార్థాలను తినడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయి. వీటిని తినడం తగ్గించాలి. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరం చాలా ఇబ్బందులకు గురవుతుందట.

పాలకోవా ,పన్నీరు, జున్ను వంటి వాటిని తినకపోవడమే ఉత్తమం. వీటిని ఎక్కువగా తినడం వల్ల మదం ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది.

ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఉన్నటువంటి ఆహారాలను సైతం తినడం వల్ల ఎక్కువగా మోకాళ్ల నొప్పులకు దారితీస్తున్నా యట.

మనం ఏదైనా చేసుకునేటప్పుడు ఫ్రై చేసిన లేదా ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలను తరచు ఎక్కువగా తింటూ ఉంటారు ఇలాంటివి తినడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయట. ముఖ్యంగా మనం తినేటువంటి ఆహార పదార్థాల వల్ల మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఆహార పదార్థాలకు అలవాటు పడితే ఖచ్చితంగా మన శరీరంలో విపరీతమైన కొవ్వు పేరుకపోయి అధిక బరువు వల్ల నడవలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొన్ని కొన్ని సార్లు  వీటివల్ల గ్యాస్ సమస్య కూడా పెరిగి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఆకుకూరల వంటకాలను తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: