సమోసాలు తింటున్నారా.. అయితే ఆ వ్యాధి బారిన పడ్డట్టే.. తస్మాత్ జాగ్రత్త?

praveen
ఉరుకుల పరుగుల జీవితం.. డబ్బు సంపాదించాలనే ఆశ.. బాస్ తిడతాడు అనే భయం.. ఇలా అన్ని మనిషిని చాలా బిజీగా మార్చేశాయి. ఈ క్రమం లోనే ఇలాంటి బిజీ లైఫ్ లో మనిషి ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేశాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నమ్మిన మనిషి ఇక ఇప్పుడు అదే ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నాడు. బిజీ లైఫ్ లో కడుపు నింపుకోవడానికి ఏది పడితే అది తినేస్తూ ఉన్నాడు. చివరికి ఇలాంటి ఆహారపు అలవాట్లు ఎన్నో అనర్థాలకు కారణం అవుతున్నాయి.

 ఒక రకంగా చెప్పాలంటే నేటి రోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు ఎన్నో అనారోగ్యాలను కొని తెచ్చుకునేందుకు కారణమవుతున్నాయి అని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలం లో స్నాక్స్ పేరు చెప్పి సమోసాలను, చిప్స్, కుకీస్ లాంటి వాటిని తెగ లాగించేస్తూ  ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక చాలా మంది సమోసాలను ఎక్కువ తినడం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఆహారపు అలవాటు ఏ మాత్రం మంచిది కాదు అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలాంటివి తినే అలవాటు ఉన్నవారు మధుమేహం బారిన పడే అవకాశం ఉంది అని ఇటీవల ఒక పరిశోధన లో కూడా తేలింది.

 సమోసాలు, చిప్స్, కుకీస్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మధు మేహానికి దారితీస్తున్నట్లు ఐసిఎంఆర్ ఎండీఆర్ఎఫ్ పరిశోధన లో తేలింది. అధిక ఉష్ణోగ్రతలు ఉండే ఈ పదార్థాలలో.. అడ్వాన్సుడ్ గ్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్ అధికంగా ఉంటాయట. ప్రోటీన్లు గ్లూకోస్ గ్లైకేసన్ ద్వారా ఇది ఏర్పడుతుందట. ఇక అధిక అడ్వాన్సుడ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ పదార్థాలు టైప్ 2 డయాబెటిస్కు కారణంగా మారి పోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే వేయించిన ఆహారాన్ని తినడం పూర్తిగా తగ్గించడం ఎంతో మేలు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: