ఇలాంటి సమస్య ఉన్నవారు.. ఉపవాసం జోలికి పోకూడదా.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

praveen
ఉపవాసం ఒక దివ్య ఔషధం అని చెబుతూ ఉంటారు పెద్దలు. కేవలం పెద్దలు మాత్రమే కాదు డాక్టర్లు కూడా ఇదే సూచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి అని అంటూ ఉంటారు. ఈ మధ్య కాలం లో ఇలా ఉపవాసం ఉండే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. కొంతమంది దైవభక్తితో ఉపవాస దీక్ష చేపడుతూ ఉంటే.. ఇంకొంతమంది డైటింగ్ పేరుతో ఉపవాసం ఉండడం లాంటివి చేస్తున్నారు.

 ఇలా డైటింగ్ కారణం గా తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉపవాసం ఉండడం చేస్తున్నారు కొంత మంది. అయితే ఉపవాసాలు చేసి ఏకంగా ఆరోగ్యానికి చేటు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేస్తే చేయడం అస్సలు మంచిది కాదట. కాదు కూడదు అని చేస్తే చివరికి ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అని హెచ్చరిస్తున్నారు. లంకనం అనేది దివ్య ఔషధం అయినప్పటికీ ఇది అందరికీ వర్తించదు అంటున్నారు వైద్యులు.

 థైరాయిడ్ సమస్య తో బాధపడుతున్న వారు ఉపవాసానికి దూరం గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో నెలసరి సక్రమం గా రాని వారు కూడా ఉపవాసం చేయడం ఏమాత్రం మంచిది కాదట. సంతాన సాఫల్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా ఇలాంటి ఉపవాసాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. శారీరకంగా మానసికం గా బలహీనంగా ఉండే వారు. మధుమేహం ఉన్నవారు కూడా ఉపవాసాలకు ఎంత దూరం గా ఉంటే అంత మంచిది అని సూచిస్తున్నారు. ఉన్న సమస్య పరిష్కారం కోసం  ఉపవాసం చేస్తే ఇక ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి లేని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: