యాక్.. బీర్ ఇలా తయారు చేస్తారా.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి ముట్టరు?

praveen
ఈ మధ్యకాలంలో మద్యం తాగే వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు మద్యం తాగే అలవాటు ఉన్న వ్యక్తులను ఏకంగా చెడ్డవారు అన్నట్లుగా చూసేది సమాజం. ఒకరకంగా అలాంటి వారిని చూస్తే కాస్త భయపడేవారు చుట్టుపక్కల మనుషులు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం మద్యం తాగే అలవాటు లేని వ్యక్తులనే కాస్త విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా పార్టీ జరుగుతున్న సమయంలో నాకు తాగే అలవాటు లేదు అని ఎవరైనా చెబితే అందరూ షాక్ అవడం కూడా నేటి రోజుల్లో జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 ఇలా మద్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది అని చెప్పాలి. కొంతమంది కేవలం సంతోషం కోసం మాత్రమే తాగుతూ ఉంటే ఇంకొంతమంది మద్యాన్ని  వ్యసనంగా మార్చుకుంటున్నారు. అయితే ఇలా మద్యంలో  ఎన్నో రకాల బ్రాండ్లు ఉన్నప్పటికీ అందరూ ఎక్కువగా ఇష్టపడేది మాత్రం బీర్లే అని చెప్పాలి. ఎందుకంటే చల్లటి బీరు గొంతులోకి దిగితే ఏకంగా అమృతం తాగినట్లుగా ఉంటుంది అని మద్యం ప్రియులు అభివర్ణిస్తూ ఉంటారు. బీరు తాగితే ఆరోగ్యం కూడా పెద్దగా పాడవదు అని అనుకుంటూ ఉంటారు.

 అయితే మీకు కూడా ఇలా బీరు తాగే అలవాటు ఉంటే మాత్రం ఇక్కడ బీరును ఎలా తయారు చేస్తారు తెలిస్తే మరోసారి ముట్టుకోరు. సింగపూర్లో న్యూ బ్రూ అనే కంపెనీ బీర్ను తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్న వాస్తవంగా మాత్రం మూత్రం, మురుగునీటిని శుద్ధి చేసిన నీటి నుంచి ఇక బీరును తయారు చేస్తూ ఉంటుంది ఆ కంపెనీ. సింగపూర్ ప్రభుత్వం దేశ డ్రైనేజీలని రీసైకిల్ చేసి  వాటర్ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తుంది. ఇక ఆ నీటినే న్యూ బ్రు కంపెనీ వాడుతూ బీర్లను తయారు చేస్తుంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తున్నామని ఈ సదరు సంస్థ వినియోగదారులకు హామీ కూడా ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: